
హైదరాబాద్‌లోని దిల్‌సుక్‌నగర్‌లో భారీ బాంబు పేలుళ్ల ఘటకు పదేళ్లు పూర్తయింది. 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ పేలుళ్ల ఘటనను బాధిత కుటుంబ సభ్యులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఈ పేలుళ్లలో దాదాపు 17 మంది మృతి చెందారు. ఎందరో గాయపడ్డారు. అప్పట్లో సంచలనం సృష్టించిన పేలుళ్ల ఘటన భయంకరమైన దృశ్యాలు బాధితుల కళ్లముందు ఇంకా కదలాడుతూనే ఉంది.
ఈ పేలుళ్లకు కారకులైన ఐదుగురు ఉగ్రవాదులకు ప్రత్యేక కోర్టు మూడేళ్ల అనంతరం మరణ శిక్ష విధించింది. 150 మీటర్ల వ్యాసార్థంలో రెండు పేలుళ్లు జరిగాయి. దిల్‌సుఖ్‌నగర్ బస్టాండు ఎదురుగా రద్దీగా ఉండే ప్రాంతంలో సైకిల్‌పై ఉగ్రవాదులు బాంబులు అమర్చారు. టిఫిన్ బాక్సులో పెట్టిన బాంబులు పేలడంతో దాదాపు 17 మంది మరణించగా, ఎంతోమంది గాయపడ్డారు.
ఈరోజుకి 10 సంవత్సరాలు కావడంతో బాంబ్ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన వారికి స్వయంగా క్షతగాత్రులే శ్రద్ధాంజలి ఘటించారు.. మాకెందుకు ఈ పాపం అని, ఇంకా మాకేం సహాయం అందలేదని వాపోతున్నారు..
దిల్‌సుఖ్‌నగర్ బస్టాండు ఎదురుగా రద్దీగా ఉండే ప్రాంతంలో సైకిల్‌పై ఉగ్రవాదులు బాంబులు అమర్చారు. టిఫిన్ బాక్సులో పెట్టిన బాంబులు పేలడంతో దాదాపు 17 మంది మరణించగా, 130 మందికిపైగా గాయపడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..