Hyderabad: ఏంటి సుధా వీళ్లు.. ఇన్ఫోసిస్ సమీపంలో తవ్వకాలు.. చివర్లో మాములు ట్విస్ట్ కాదు..
జనాలకు బద్దకం పెరిగింది. పుక్కట్లో పైసలు రావాలే అని ఆరాడపడుతున్నారు. ఇందుకోసం కొందరు అడ్డదార్లు తొక్కుతున్నారు. తాజాగా పోచారం ఇన్ఫోసిస్ కంపెనీ సమీపంలో తవ్వకాలు కలకలం రేపాయి. అర్థరాత్రి సమయంలో అనుమానాస్పద కదలికలు గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. తీరా వారు వెళ్లి చూడగా ...

ఈ మధ్య క్యాష్ కావాలి.. కానీ కష్టం వద్దు అనే ఆలోచన భయంకరంగా పెరుగుతోంది. ఇంట్లో కూర్చుని ఫోన్లు నొక్కితే డబ్బులు రావాలి… లేదంటే షార్ట్ కట్‌లో పైసలు సంపాదించడం కోసం ఏదో ఒక అడ్డదారి వెతకాలి. ఈ అలవాటు వల్ల ఎన్నో రకాల మోసాలు, విచిత్ర సంఘటనలు బయటపడుతున్నాయి. అటువంటి మరో విచిత్ర ఘటన హైదరాబాద్ వద్ద చోటుచేసుకుంది. పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ పక్కనే అర్థరాత్రి సమయంలో అనుమానాస్పద కదలికలు కనిపించాయి. టార్చ్‌లైట్లు, పూజా సామాగ్రి, గడ్డపారలు… చూస్తే ఏదో రహస్య కార్యక్రమం జరుగుతున్నట్టే అనిపించింది. ఇదే విషయం స్థానికుల దృష్టికి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు.. తవ్విన ఓ పెద్ద గుంతతో పాటు.. పగలగొట్టిన కొబ్బరికాయలు, నిమ్మకాయలు కనిపించాయి. ఏదో పూజ తంతులా ఉంది. స్పాట్‌లో 8 మంది పోలీసులకు చిక్కారు. ప్రశ్నిస్తే మొదట్లో ఎవరూ నోరు విప్పలేదు. ఎంత అడిగినా ఏమీ లేదు సార్ అని తప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు తమదై స్టైల్‌లో అడగడంతో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని.. ఒక కారు, రెండు బైకులు, పూజా వస్తువులు, గుంతలు తవ్వే సామగ్రి, ఎనిమిది మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. కొన్ని రోజుల క్రితం వరంగల్, ములుగు జిల్లాల్లో కూడా ఇదే తరహా కథ హడావుడి చేసింది. మంగపేట ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ .. మరికొందరితో కలిసి మహారాష్ట్రలో తవ్వకాలు జరిపి రాగి బిందె దొరికిందని చెప్పాడు. అందులో బంగారు నాణేలు ఉన్నాయంటూ గుట్టుగా పంచుకునే ప్లాన్ వేసినప్పటికీ, పంపకాల విషయంలో గొడవ జరిగి విషయం పోలీసులకు దృష్టికి వెళ్లింది. ఈజీగా వచ్చే డబ్బు అన్నది.. కేవలం కథల్లో, కబుర్లలో మాత్రమే ఉంటుంది. నిజ జీవితంలో మాత్రం కష్టాన్ని తప్పించే షార్ట్ కట్‌లు అన్నీ.. చివరకు పోలీస్ స్టేషన్ వద్దకే తీసుకెళ్తాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
