MLC Kavitha Arrest: సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత ఛాలెంజ్‌ పిటిషన్‌

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక మలుపు తిరుగుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దూకుడు పెంచారు. ఇందులు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం సాయంత్రం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేశారు. అనంతరం ఎయిర్ట్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో కవిత

MLC Kavitha Arrest: సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత ఛాలెంజ్‌ పిటిషన్‌
Mlc Kavitha

Updated on: Mar 15, 2024 | 8:11 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక మలుపు తిరుగుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దూకుడు పెంచారు. ఇందులు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం సాయంత్రం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేశారు. అనంతరం ఎయిర్ట్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. ఈడీ అధికారులు తనను అరెస్ట్‌ చేయడంపై సవాలు చేస్తూ ఆమె శనివారం సుప్రీం కోర్టులో ఛాలెంజ్‌ పిటిషన్‌ను దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్లేముందు ఆమె బీఆర్‌ఎస్‌ శ్రేణులకు అభివాదం చేశారు. చట్టంపై తనకు నమ్మకం ఉందని, న్యాయస్థానంలో తాను గెలిచి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. కవిత అరెస్ట్‌తో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున ఆమె ఇంటికి తరలివచ్చారు. బీజేపీపై ఆరోపనలు చేస్తూ నినాదాలు చేశారు.

కవితను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా, ఢిల్లీకి వెళ్లే ముందు కవిత కొడుకు ధైర్యం చెప్పారు. అలాగే భర్త సైతం కవితను ధైర్యం చెప్పారు. ఈ కేసులో ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడేది లేదని, కోర్టులో తనకు న్యాయం జరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేస్తూ కారులో బయలుదేరి శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టకు బయలుదేరారు.

కాగా, కవితకు రేపు ఢిల్లీలో వైద్య పరీక్షలు చేసిన అనంతరం కోర్టులో హాజరు పర్చనున్నారు. అయితే శంషాబాద్‌ ఎయిర్ట్‌ నుంచి బయలుదేరిన కవిత నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకోనున్నారు. రాత్రి ఈడీ కార్యాలయాంలో కవిత ఉండనున్నారు. శనివారం వైద్య పరీక్షల అనంతరం రౌస్‌అవెన్యూ కోర్టులో హాజరు పర్చనుంది ఈడీ.

ఇవి కూడా చదవండి