Eagle Squad: తెలంగాణ పోలీసులకు సరికొత్త ఆయుధాలు.! డ్రోన్ దాడులకై ఈగల్ స్క్వాడ్
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఈగల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన రెండు గద్దలను తమ టీమ్ లో చేర్చుకున్నారు. వీటితో డ్రోన్ దాడులకు చెక్ పెట్టవచ్చని తెలంగాణ డీజీపీ రవి గుప్తా అలాకర్ పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం మొయినాబాద్ లోని ట్రైనింగ్ అకాడమీలో ఈ గద్దలను పరీక్షించి చూశారు. సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి ఈగల్ స్క్వాడ్ పనితీరును పరిశీలించారు.
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఈగల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన రెండు గద్దలను తమ టీమ్ లో చేర్చుకున్నారు. వీటితో డ్రోన్ దాడులకు చెక్ పెట్టవచ్చని తెలంగాణ డీజీపీ రవి గుప్తా అలాకర్ పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం మొయినాబాద్ లోని ట్రైనింగ్ అకాడమీలో ఈ గద్దలను పరీక్షించి చూశారు. సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి ఈగల్ స్క్వాడ్ పనితీరును పరిశీలించారు. ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్ ను గుర్తించిన వెంటనే గాల్లోకి లేచిన ఓ గద్ద.. డ్రోన్ ను కాలితో పట్టుకుని నేల మీదికి తీసుకువచ్చింది. కాగా, ఇలా శిక్షణ పొందిన గద్దలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని, నెదర్లాండ్స్ తర్వాత తెలంగాణలోనే ఈగల్ స్క్వాడ్ ఉందని డీజీపీ చెప్పారు. రాష్ట్ర పోలీసుల ప్రత్యేక బృందం ఈ గద్దలకు మూడేళ్లుగా శిక్షణ ఇస్తోందని డీజీపీ చెప్పుకొచ్చారు. వీఐపీ సందర్శనలు, బహిరంగ సభలు, సమావేశాల సమయంలో భద్రతా విధులకు ఈగల్ స్క్వాడ్ ను ఉపయోగించాలని నిర్ణయించినట్లు రవి గుప్తా పేర్కొన్నారు. అంతర్గత భద్రతా విభాగం ఈ ఈగల్ స్క్వాడ్ ను పర్యవేక్షిస్తుందని వివరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

