అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌతే తుపాను ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపైనా పడింది. మంగళవారం ఉదయం నుంచే హైదరాబాదులోనూ భారీ వర్షం కురిసింది. నగరంలో తెల్లవారుజాము నుంచే వాతావరణం ఒక్కసారిగా మారింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
రామంతాపుర్, ఉప్పల్, నారాయణగుడ, నిజాంపేట్, బాచుపల్లి, దుండిగల్, ప్రగతినగర్, కూకట్‌పల్లి, కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు, మూసాపేట్, బాలానగర్, ఫతేనగర్, మియాపూర్, చందానగర్, బీహెచ్ఈఎల్, మొయినాబాద్, చిలుకూర్, అత్తాపూర్, రాజేంద్రనగర్‌లో వర్షం పడుతోంది. మాన్సూన్ బృందాలను బల్దియా అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలు రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా హెచ్చరికలు జారీ చేసింది.
రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్, కిస్మత్‌పుర, గండిపేట్, శంషాబాద్, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, ఎంజే మార్కెట్, అబిడ్స్, మలక్‌పేట్, కొత్తపేట, వనస్థలిపురం, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, కృష్ణానగర్, సికింద్రాబాద్, తార్నాక, నాచారం, మల్లాపూర్, నాగారంతోపాటు జీడిమెట్ల, సూరారం, ఈసీఐఎల్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. లాక్‌డౌన్ సడలింపు సమయంలో వర్షం పడటంతో వాహనదారులు, నిత్యాసరాలు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చిన వారు ఇబ్బంది పడుతున్నారు.
ఇవి కూడా చదవండి: Hardik Pandya: జూనియర్ పాండ్య వేస్తున్న బుడి బుడి అడుగులను ఎంజాయ్ చేస్తున్న హార్దిక్ పాండ్య.. ( వీడియో )