Bike Stunt On Road: చేతిలో బైక్ ఉంటే చాలు తమ కంటే తోపులు లేరని భావిస్తుంటారు కొందరు. మరీ ముఖ్యంగా యువకులు తమను తాము హీరోలుగా భావిస్తుంటారు. బైక్‌పై రయ్యి రయ్యిమంటూ దూసుకుపోతుంటారు. అయితే ఈ క్రమంలో తమ ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలను సైతం రిస్క్‌లో పెడుతున్నారు. తమలోని హీరోయిజాన్ని బయటపెట్టుకునేందుకు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై కొందరు యువకులు రచ్చ రచ్చ చేశారు.
నిజానికి కేబుల్ బ్రిడ్జ్‌పై వాహనాలను నిలపడానికి అనుమతులు లేవు. పోలీసులు ఎప్పటికప్పుడు ఆగి ఉన్న వాహనాలను హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ కొందరు మాత్రం ఫ్లైఓవర్‌పై వాహనాలను నిలుపుతూ ఇతర వాహనదారులకు సైతం ఇబ్బంది కలిగిస్తున్నారు. తాజాగా కొందరు యువకులు ఇలాగే ఫ్లై ఓవర్‌పై బైక్‌లు ఆపి నానా హంగామా చేశారు. బైక్‌లపై విన్యాసాలు చేస్తూ రచ్చ చేశారు. అయితే ఫ్లై ఓవర్ మొదట్లో ఉన్న పోలీసు అధికారి మైక్‌లో హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతూ రెచ్చిపోయారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు పోకిరీలను స్టేషన్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. బైక్‌పై స్టంట్స్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది సృష్టించిన వారికి పోలీసులు తిక్క కుదిర్చారు అంటూ పలువురు అనుకుంటున్నారు.
రోడ్డుపై ప్రమాదకరంగా వాహనాలు నిలపడం, ప్రమాదకర విన్యాసాలు చేయకండి. #RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/inQMo1IrZM
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) August 11, 2021
Also Read: Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. విత్‌డ్రా లిమిట్ పెంపు.. కొత్త నిబంధనలు
Raj Kundra Case: రాజ్ కుంద్రాకు బెయిల్ వద్దేవద్దు.. బెయిల్ ఇస్తే దేశం విడిచి ఎస్కేప్ కావొచ్చు!