CP Stephen Ravindra: సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆన్ రెయిన్ డ్యూటీ.. స్వయంగా ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తూ..

| Edited By: శివలీల గోపి తుల్వా

Jul 25, 2023 | 7:16 AM

హైదరాబాద్ న్యూస్, జూలై 25: సోమవారం ఉదయం నుంచి మామూలుగా ఉండి సాయంత్రం నుంచి ఒక్కసారిగా మొదలైన వర్షంతో నగరం మొత్తం తడిసి ముద్దయింది. ఆఫీసులో ముగించుకొని అందరి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఇక్కడ అని తేడా లేకుండా నగరం మొత్తం ట్రాఫిక్..

CP Stephen Ravindra: సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆన్ రెయిన్ డ్యూటీ.. స్వయంగా ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తూ..
Cyberabad CP Stephen Ravindra
Follow us on

హైదరాబాద్ న్యూస్, జూలై 25: సోమవారం ఉదయం నుంచి మామూలుగా ఉండి సాయంత్రం నుంచి ఒక్కసారిగా మొదలైన వర్షంతో నగరం మొత్తం తడిసి ముద్దయింది. ఆఫీసులో ముగించుకొని అందరి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఇక్కడ అని తేడా లేకుండా నగరం మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎల్బీనగర్ ,ఉప్పల్ ,చందానగర్ ఇలా నగరం నలుమూలల ట్రాఫిక్ అష్ట దిగ్బంధనం లో నగరవాసుల చిక్కుకున్నారు. ఇక ఐటీ కారిడార్ ఆయన హైటెక్ సిటీ, గచ్చిబౌలి కొండాపూర్ లాంటి ఏరియా ల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఏక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గంటల తరబడి రోడ్ల మీదే వర్షంలో తడుస్తూ వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ట్రాఫిక్ డిసిపి రంగంలోకి దిగి క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ రూట్‌కి ఆల్టర్నేటివ్ రూట్ లను చూశారు. వర్ష తీవ్రత పెరగడంతో ఏకంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర రంగంలోకి దిగారు.

క్షేత్రస్థాయిలో అక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు సిపి స్టీఫెన్ రవీంద్ర ఐక్య రోటరీ వద్ద చేరుకొని వర్షం లో తడుస్తూ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తూ సిపి ఆన్ రైన్ డ్యూటీ అన్నట్టు సిద్ధమయ్యారు. సైబరాబాద్ కమిషనర్ రైన్ డ్యూటీలో ఉండటంతో వాహనదారులు పోలీసుల తీరును ప్రశంసిస్తున్నారు. కానీ ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఇరుక్కొని తడిసి ముద్దవుతున్న సగటు హైదరాబాది ఇంటికి ఎలా చేరేది అంటూ తలలు పట్టుకుంటున్నారు. మరోపక్క పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆలస్యమైన వర్షం తగ్గాకే రోడ్లమీదకి వస్తే మంచిదని అప్పటివరకు ఎక్కడి వారు అక్కడ ఉండటం ఉత్తమమని సూచిస్తున్నారు. కేవలం అరగంట పాటు కురిసిన వర్షానికి నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వడంతో నగరం మొత్తం హాయ్ అలర్ట్ ప్రకటించారు. జిహెచ్ఎంసి, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసులు సమన్వయంతో పరిస్థితిని చేయి దాటకుండా చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..