Cyber Crime: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు అమాయకులనే లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడిన కేటుగాళ్లు.. గత కొంతకాలంగా ఉన్నతను అభ్యసించిన వారిని సైతం బురిడీ కొట్టిస్తున్నారు. రాజ్యంగబద్ద పదవులు అనుభవించిన వారు సైతం వీరి చేతిలో బలైపోతున్నారు. ఇప్పటి వరకు పోలీసు ఉన్నతాధికారులకే టోకరా పెట్టిన సందర్భాలు వెలుగుచూడగా.. తాజాగా తెలంగాణ హైకోర్టుకు చెందిన మాజీ న్యాయమూర్తిని మోసం చేశారు. విద్యుత్ బిల్లు కట్టలేదంటూ నమ్మబలికన సైబర్ నేరగాళ్లు.. ఆ మాజీ న్యాయమూర్తి నుంచి 50 వేల రూపాయలు కాజేశారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనిపై బాధిత మాజీ న్యాయమూర్తి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ హైకోర్టులో పని చేసిన మాజీ న్యాయమూర్తి జస్టిస్ రాజా గోపాల రెడ్డి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో నివాసం ఉంటున్నారు. అయితే, మీరు విద్యుత్ బిల్ కట్టలేదని, మీ కరెంట్ కనెక్షన్‌ను కట్ చేస్తామంటూ ఆయన సెల్ ఫోన్‌కు మెసేజ్ పంపారు. ఆ కేటుగాళ్లు పంపిన మెసేజ్‌ని నమ్మిన ఆయన.. ఆ మెసేజ్‌లో ఉన్న కస్టమర్ కేర్ నెంబర్‌కు ఫోన్ చేశారు. సైబర్ నేరగాళ్లు ఆయన్ను నమ్మించి.. డెబిట్ కార్డు డీటెయిల్స్ తీసుకున్నారు. అలా ఆయన అకౌంట్ నుంచి రూ. 50 వేలు దోచుకున్నారు. జరిగిన మోసాన్ని గ్రహించిన రాజా గోపాల రెడ్డి.. నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ పోలీసులకు జరిగిందంతా వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
Also read:
‘నా ఫోన్ కూడా హ్యాక్ అయింది.. పరిస్థితి చాలా సీరియస్’.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన