Covid Vaccine: తెలంగాణ సర్కార్ మరో ముందడుగు.. 18 ఏళ్లు దాటిన వారికి ఇవాళ్టి నుంచి టీకాలు

|

Jul 01, 2021 | 8:44 AM

18 ఏళ్లు నిండినవారికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పద్దెనిమిది ఏళ్లు పైబడిన పౌరులందరికీ  కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు గురువారం నుంచే..

Covid Vaccine: తెలంగాణ సర్కార్ మరో ముందడుగు.. 18 ఏళ్లు దాటిన వారికి ఇవాళ్టి నుంచి టీకాలు
Youth Covid Vaccination
Follow us on

కరోనా కట్టడిలో  తెలంగాణ ప్రభుత్వం వేగంగా దూసుకుపోతోంది. సూపర్ స్పైడర్ పేరుతో లక్షల టీకాలు వేసిన సర్కార్ ఇప్పుడు 18 ఏళ్లు నిండినవారికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పద్దెనిమిది ఏళ్లు పైబడిన పౌరులందరికీ  కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు గురువారం నుంచే హైదరాబాద్‌లో సేవల్ని మొదలుపెట్టాలని గ్రేటర్‌ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇందు కోసం బల్దియాలో అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టింది.

ఇప్పటి వరకూ 35 ఏళ్లు దాటిన వారికి మాత్రమే నగరంలో GHMC ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సిన్‌ కేంద్రాల ద్వారా టీకాలు వేస్తున్నారు. అధిక ప్రమాదమున్న వారు, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన 1.5 కోట్లకు పైగా వ్యక్తులకు కరోనా వ్యాక్సిన్లను అందించే కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసింది. ఆరోగ్యశాఖ GHMC ప‌రిధిలో 100 GCVC ల‌ను, అర్బ‌న్ లోక‌ల్ బాడీల్లో 204 GCVCల‌ను, గ్రామీణ ప్రాంతాల్లోని 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అర్హత ఉన్నవారికి టీకాలు వేసే కార్య‌క్ర‌మానికి చేపట్టింది.

తాజాగా గురువారం నుంచి అందరికీ టీకాలు వేసేందుకు మొత్తం 100 కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్లు GHMC ఓ ప్రకటనలో తెలిపింది. టీకా తీసుకునే వారు తప్పనిసరిగా వివరాలను ‘కొవిన్‌’ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని.. నమోదు చేసుకున్న వారికి మాత్రమే వేస్తారని స్పష్టం చేసింది. పేర్లు నమోదు చేసుకొని సమీప ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకోవాలని సూచించింది.

ఇవి కూడా చదవండి: Anti-Drone System: జమ్ముకశ్మీర్‌లో డ్రోన్‌ టెర్రర్‌‌కు చెక్.. ఎయిర్‌బేస్‌పై యాంటీ డ్రోన్‌ జామర్లు

Warangal Chai Wala: మహ్మద్‌ పాషాతో ఫోన్‌లో మాట్లాడనున్న ప్రధాని మోడీ.. ‘మన్ కీ బాత్’లో వరంగల్ చాయ్ వాలా