Hyderabad: కాల్పుల కేసులో సిరీయల్ నటుడు మనోజ్‌కి రిమాండ్.. చర్లపల్లి జైలుకి తరలింపు

|

Jul 16, 2023 | 9:56 PM

Hyderabad News: శామీర్‌పేట్‌ కాల్పుల కేసు సీరియల్‌కి తక్కువ...సినిమాకి ఎక్కువలా తయారయ్యింది. ఓ వైపు సిద్ధార్థ్‌పై కాల్పులకు పాల్పడ్డ మనోజ్‌ను 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. వారం రోజుల పాటు కస్టడీని కోరుతూ పిటిషన్‌ దాఖలు..

Hyderabad: కాల్పుల కేసులో సిరీయల్ నటుడు మనోజ్‌కి రిమాండ్.. చర్లపల్లి జైలుకి తరలింపు
Serial Actor Manoj
Follow us on

Hyderabad News: శామీర్‌పేట్‌ కాల్పుల కేసు సీరియల్‌కి తక్కువ…సినిమాకి ఎక్కువలా తయారయ్యింది. ఓ వైపు సిద్ధార్థ్‌పై కాల్పులకు పాల్పడ్డ మనోజ్‌ను 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. వారం రోజుల పాటు కస్టడీని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయబోతున్నారు శామీర్‌ పేట్‌ పోలీసులు. మరోవైపు టీవీ9 చేతికి చిక్కిన రిమాండ్‌ రిపోర్ట్‌లో విషయాలు ఆసక్తికరంగా మారాయి. శామీర్‌పేట్‌ సెలబ్రిటీ క్లబ్‌ కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. వైద్య పరీక్షల తర్వాత మనోజ్‌ను మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరపర్చారు. మనోజ్‌కి14 రోజుల రిమాండ్‌ విధించడంతో…చర్లపల్లి జైలుకు తరలించారు. మనోజ్‌ని వారం రోజుల పాటు కస్టడీకి కోరనున్నారు శామీర్‌పేట్‌ పోలీసులు. ఫైరింగ్ చేసిన ఎయిర్‌గన్‌ను ఇప్పటికే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు పోలీసులు.

శామీర్‌పేట్‌ కాల్పుల కేసు రిమాండ్‌ రిపోర్ట్‌ టీవీ9 చేతికి చిక్కింది. 2003లో స్మితకు సిద్ధార్థ్‌తో పెళ్ళి జరిగింది. వీరికి 17 ఏళ్ళ కొడుకు, 13 ఏళ్ళ కూతురు ఉన్నారు. వీరిద్దరూ గతంలో మూసాపేటలో ఉండేవారు. 2018లో సిద్ధార్థ్‌పై స్మిత 498 A..గృహ హింస కేసు పెట్టిన తరువాత ఇద్దరూ విడాకులు తీసుకున్నట్లు రిమాండ్‌ రిపోర్టు వెల్లడించింది. మనోజ్‌ హింసిస్తున్నట్లు CWCకి స్మిత కొడుకు ఫిర్యాదు చేయడంతో పిల్లల్ని చూసేందుకు శనివారం ఉదయం 8:30amకి సెలబ్రిటీ విల్లాకు వెళ్ళాడు సిద్ధార్థ్‌. సిద్ధార్థ్‌ని చూడగానే స్మిత మనోజ్‌ని పిలవడంతో…లోపలి నుంచి ఎయిర్‌గన్‌తో వచ్చి సిద్ధార్థ్‌పై కాల్పులు జరిపాడు మనోజ్‌. సిద్ధార్థ్‌ తప్పించుకొని డయల్‌ 100 కి కాల్‌ చేసినట్టు రిమాండ్‌ రిపోర్ట్‌ లో ఉంది.

ఫ్రెండ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తో షూట్‌చేసిన మనోజ్‌ గతంలో సినిమాలూ, సీరియల్స్‌లో నటించేవాడు. మనోజ్‌కి అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్‌లో ఉన్నట్టు రిమాండ్‌ రిపోర్టు చెపుతోంది. కేసులో కొత్త కోణం వెలుగుచూసింది…2019లో స్మిత, సిద్ధార్థ్‌లు విడాకులు తీసుకున్నప్పటినుంచి పిల్లలతో కూడా సిద్ధార్థ్‌కి సంబంధాలు లేవని సిద్ధార్థ్‌ టీవీ9 కి చెప్పారు. 2021 లో బర్త్‌డే సందర్భంగా ఒకసారి వాట్సాప్ మెసేజ్‌ వచ్చింది. మనోజ్‌పై స్మిత కుమారుడు సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి వివరాలు సేకరించారు. నిజానికి సిద్ధార్థ్‌ని చంపే ఉద్దేశ్యంతోనే మనోజ్‌ కాల్పులు జరిపాడనీ…తృటిలో సిద్ధార్థ్‌ ప్రాణాలతో బయటపడ్డట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..