AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌‌లో సీన్‌ ఛేంజ్‌.. కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు..

హైదరాబాద్‌ సిటీలో అడుగుజాడ లేదు. వెతికిచూసినా కాంగ్రెస్‌ నీడ కనిపించలేదు. ఇది మూడేళ్ల కిందటి ముచ్చట. సీన్‌ కట్‌ చేస్తే...మహానగరంలో రెండు అసెంబ్లీ సీట్లు గెలిచి కాలర్‌ ఎగరేస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ముచ్చటగా మూడో సీటు కూడా గెలుస్తామని తొడ కొడుతోంది అధికార పార్టీ. రాబోయే గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలనాటికి హైదరాబాద్‌లో బలం పుంజుకునే స్ట్రాటజీతో, కాంగ్రెస్‌ ఇలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా?

Congress: మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌‌లో సీన్‌ ఛేంజ్‌.. కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు..
Telangana Congress
Shaik Madar Saheb
|

Updated on: Sep 29, 2026 | 8:07 AM

Share

2023 చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయదుందుభి మోగించి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రమంతటా కాంగ్రెస్‌ గాలి వీచింది. మూడు రంగుల జెండా రెపరెపలాడింది. అయితే తెలంగాణకు తలమానికమైన హైదరాబాద్‌ మహానగరంలో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేకపోయింది అధికార కాంగ్రెస్‌. ఓల్డ్‌ సిటీ వదిలేస్తే, సిటీలోని సీట్లన్నింటిని ఒక్కటి మినహాయించి గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా కూడా గులాబీ పార్టీ తరఫున గద్వాల విజయలక్ష్మి ఎంపికయ్యారు. నగరంలోని మూడు ఎంపీ సీట్లలో ఒక్కటి కూడా కాంగ్రెస్‌కి దక్కలేదు. మల్కాజ్‌గిరి నుంచి బీజేపీ ఎంపీగా ఈటల రాజేందర్, సికింద్రాబాద్‌ నుంచి బీజేపీ ఎంపీగా కిషన్‌రెడ్డి గెలిచారు. హైదరాబాద్‌ ఎంపీ షరా మామూలే అన్నట్టు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గెలిచారు.

మూడేళ్ల తర్వాత సీన్‌ ఛేంజ్‌

సుమారు మూడేళ్ల తర్వాత సిట్యువేషన్‌ టర్న్‌ అయింది. పొలిటికల్ సీన్‌ మారుతోంది. మేయర్‌ విజయలక్ష్మి కారు దిగి హస్తం అందుకున్నారు. ఇప్పుడు తాజా మాజీగా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు ఉపఎన్నిక వచ్చింది. సిట్టింగ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్‌లో మరణించడంతో ఉపఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీ గణేష్‌ విజయం సాధించారు. దీంతో నగరంలో హస్తం పార్టీ ఖాతా తెరిచినట్టయింది. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతితో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి ఉపఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్ విజయం సాధించారు. దీంతో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ టాలీ రెండుకు పెరిగింది.

ఇప్పుడు ఖైరతాబాద్ వంతు

ఇప్పుడు ఖైరతాబాద్‌ వంతు వచ్చింది. అక్కడ కూడా గెలిస్తే సిటీలో కాంగ్రెస్‌ ముచ్చటగా మూడో సీటు గెలిచినట్టు అవుతుంది. 2023లో బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్‌లోకి జంప్‌ చేసిన దానం నాగేందర్‌పై కోర్టు అనర్హత వేటు వేసింది. దీంతో ఆ సీటు ఖాళీ అయింది. రాబోయే ఉపఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలుస్తానన్నారు దానం. ఒకవేళ ఖైరతాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ గెలిస్తే, నగరంలో కాంగ్రెస్‌ బలం మూడు అసెంబ్లీ సీట్లకు పెరుగుతుంది.

నగరంలో బలం పుంజుకుంటున్న కాంగ్రెస్‌

నగరంలో వరుసగా అసెంబ్లీ సీట్లను గెలుస్తూ, అంచెలంచెలుగా బలం పుంజుకుంటున్న కాంగ్రెస్‌…. గ్రేటర్‌ హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లపై గురి పెట్టింది. రాబోయే మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికల నాటికి మరింత బలోపేతం అయ్యేలా కాంగ్రెస్‌ ఇలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందంటున్నారు విశ్లేషకులు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పరగడుపున నెయ్యి, తులసి రసం తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
పరగడుపున నెయ్యి, తులసి రసం తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
హైదరాబాద్‌‌లో సీన్‌ ఛేంజ్‌.. కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు..
హైదరాబాద్‌‌లో సీన్‌ ఛేంజ్‌.. కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు..
తొలిరోజే హీటెక్కిన గొడవలు.. గాయాలతో ముగిసిన టాస్క్
తొలిరోజే హీటెక్కిన గొడవలు.. గాయాలతో ముగిసిన టాస్క్
బ్లడ్ షుగర్,అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం! మెంతుల కాంబినేషన్
బ్లడ్ షుగర్,అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం! మెంతుల కాంబినేషన్
చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు
చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు
రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ బిర్యానీ.. ఇంట్లో ఎలా చేయాలంటే?
రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ బిర్యానీ.. ఇంట్లో ఎలా చేయాలంటే?
మీరు GST చెల్లించకపోతే మీ వ్యాపారం వెంటనే మూసివేస్తారా?
మీరు GST చెల్లించకపోతే మీ వ్యాపారం వెంటనే మూసివేస్తారా?
గర్భసంచిని క్లీన్ చేసే దివ్యౌషధం..నెలసరి నొప్పులకు చెక్!
గర్భసంచిని క్లీన్ చేసే దివ్యౌషధం..నెలసరి నొప్పులకు చెక్!
ఓటటీలో వణుకు పుట్టిస్తోన్నరియల్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటటీలో వణుకు పుట్టిస్తోన్నరియల్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?