AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain News: ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. ఈ జిల్లాలకు అలర్ట్ జారీ.. వాతావరణశాఖ అప్డేట్ ఇదిగో..

ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో అక్టోబర్ 21వ తేదీన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు వాతావరణశాఖ ఒక ప్రకటన జారీ చేసింది. వర్షాల క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Rain News: ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. ఈ జిల్లాలకు అలర్ట్ జారీ.. వాతావరణశాఖ అప్డేట్ ఇదిగో..
Rains
Venkatrao Lella
|

Updated on: Oct 20, 2026 | 7:15 PM

Share

ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. థాయిలాండ్, మయన్మార్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం రేపు ఉదయానికి ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ, ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆతరువాత ఇది వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అటు నైరుతి బంగాళాఖాతం మరియు తమిళనాడు తీర ప్రాంతంపై ఉన్న ఈ ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో బుధవారం (21-10-2026) తేదీన పోలవరం, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వర్షాల క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షాలు పడే సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్..

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా  ఈ వర్షాలు కొనసాగే అవకాశముంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో వానలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా ఛాన్స్ ఉందని, దీంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు 112, 1070, 1800 425 0101 సేవ్ చేసి పెట్టుకోవాలని సూచించింది. మంగళవారం రోజున అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.  ద్రోణి ప్రభావంతో పోలవరం,కోనసీమ,పశ్చిమగోదావరి, కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు,అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

తెలంగాణలో వర్షాలు

అటు తెలంగాణలో కూడా పలు ప్రాంతాలకు వర్షసూచన జారీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ వెదర్ బులిటెన్ విడుదల చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు పలు జిల్లాల్లో వానలు పడతాయని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది.

Follow Us