Hyderabad: బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లే మలక్‌పేట బాలింతల మృతికి కారణం.. నిర్ధారించిన వైద్యారోగ్యశాఖ..!

|

Jan 17, 2023 | 12:00 PM

బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్ల కారణంగానే మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆసుపత్రిలో పరిశుభ్రత లోపమే వారి మరణానికి, బ్యాక్టీరియల్‌..

Hyderabad: బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లే మలక్‌పేట బాలింతల మృతికి కారణం.. నిర్ధారించిన వైద్యారోగ్యశాఖ..!
Malakpet Women
Follow us on

హైదరాబాద్ మలక్‌పేటలో 4రోజుల క్రితం ఇద్దరు బాలింతలు ప్రసవం తర్వాత మరణించిన సంగతి తెలిసిందే.  అయితే ఇప్పుడు ఆ కేసులో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్ల కారణంగానే మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆసుపత్రిలో పరిశుభ్రత లోపమే వారి మరణానికి, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లకు ప్రధాన కారణమని గుర్తించినట్లు సమాచారం. అయితే వారు మరణించిన నేపథ్యంలో ఈ బాలింతల కంటే ముందు సిజేరియన్‌ చేయించుకున్న మరో 18 మందిని నిమ్స్‌ ఎమర్జెన్సీ వార్డుకు అప్పటికప్పుడు తరలించారు వైద్యులు.

అయితే వీరిలోని ఇద్దరు బాలింతల కిడ్నీలకు ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో రెండు రోజులుగా డయాలసిస్‌ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం కాస్త ఆందోళకరంగా ఉందని, కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. అలాగే వారిలోని మరో 9 మందిని సోమవారం డిశ్చార్జి చేయగా..ఇంకా ఏడుగురు బాలింతలు చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

కాగా, ఇటీవలే మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో సిజేరియన్‌ చేయించుకున్న తర్వాత ఆరోగ్యం విషమించడంతో.. నాగర్‌కర్నూల్‌ జిల్లా చెదుమపల్లికి చెందిన సిరివెన్నెల (23), హైదరాబాద్‌ పూసలబస్తీకి చెందిన శివాని (24) గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు 12న, మరొకరు 13న కన్నుమూసిన సంగతి తెలిసిందే.  వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. వారి తీరును నిరసిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. అయితే వైద్యులది తప్పులేదని తొలుత ఉన్నతాధికారులు తేల్చారు. తాజా విచారణలో బాలింతల మృతికి బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లే కారణమని తేలడంతో తప్పు ఎక్కడ జరిగిందనే విషయమై వారు ఆరా తీస్తున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి..