Hyderabad: వాహనదారులకు అలెర్ట్‌.. ట్రాఫిక్‌ జరిమానాలపై పోలీసుల కీలక ప్రకటన.. వివరాలివే

|

Nov 23, 2022 | 1:11 PM

నగరంలో అమలవుతోన్న ట్రాఫిక్‌ జరిమానాలపై సిటీ ట్రాఫిక్‌ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎ.వి.రంగనాథ్‌ స్పందించారు. 2011లో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారమే ప్రస్తుతం ట్రాఫిక్‌ జరిమానాలు విధిస్తున్నట్టు స్పష్టం చేశారు.

Hyderabad: వాహనదారులకు అలెర్ట్‌.. ట్రాఫిక్‌ జరిమానాలపై పోలీసుల కీలక ప్రకటన.. వివరాలివే
Traffic Rules
Follow us on

నగరంలో రోడ్డుప్రమాదాలను కట్టడి చేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాల పేరిట వాహనదారుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నారంటూ సోషల్‌ మీడియాలో బాగా నెగెటివ్‌ ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి ట్రాఫిక్‌ పోలీసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలో  హైదరాబాద్ నగరంలో అమలవుతోన్న ట్రాఫిక్‌ జరిమానాలపై సిటీ ట్రాఫిక్‌ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎ.వి.రంగనాథ్‌ స్పందించారు. 2011లో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారమే ప్రస్తుతం ట్రాఫిక్‌ జరిమానాలు విధిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ నిబంధనల ప్రకారం ట్రిపుల్‌ రైడింగ్‌లో పట్టుబడిన వాహనదారులకు రూ.1200 జరిమానా విధిస్తున్నామన్నారు. అలాగే రాంగ్‌సైడ్‌ ప్రయాణించే ద్విచక్రవాహనాలు, ఆటోలకు రూ.200, కార్లు, లారీల వంటి భారీ వాహనాలకు రూ.1700 జరిమానా విధిస్తామన్నారు.

ప్రత్యేక తనిఖీలు..

కాగా ట్రాఫిక్‌ నిబంధనల పటిష్ఠ అమలుకు సంబంధించి నగర ట్రాఫిక్‌ పోలీసు సమావేశ మందిరంలో మూడు కమిషనరేట్ల ట్రాఫిక్‌ పోలీసు అధికారుల సమావేశం జరిగింది. ప్రముఖుల పర్యటనలు, సరిహద్దుల వద్ద ట్రాఫిక్‌ రద్దీ, భారీ వాహనాల రాకపోకలు, 7 సీట్ల షేరింగ్‌ ఆటోలు, రోప్‌వే అమలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశం మాట్లాడిన సిటీ ట్రాఫిక్‌ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌ ఈ నెల 28 నుంచి ప్రత్యేక తనిఖీలతో రాంగ్‌సైడ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌కు అడ్డుకట్ట వేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు సమన్వయంతో పనిచేయనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..