Drugs in Hyderabad: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుందా..? యువత మత్తు బారిన పడుతుందా..? అసలు మహానగరానికి డ్రగ్స్ ఎలా చేరుతున్నాయి.. ఈ మాఫియా వెనుక ఎవరున్నారు..? ఇవన్నీ ఇప్పటికీ వేధిస్తున్న ప్రశ్నలే.. అయితే.. తాజాగా, సైబరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ గుప్పుమనడం కలకలం రేపింది. భారీగా మత్తు పదార్థాలు సప్లయ్ చేస్తున్న డ్రగ్ ముఠాను సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు చాకచాక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే కొకైన్‌ను సీజ్ చేశారు. డ్రగ్ కింగ్ పిన్‌తో పాటు మరో నలుగుర్ని అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొస్తూ హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
అయితే, పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. డ్రగ్ మాఫియా రెచ్చిపోతూనే ఉంది. లేటెస్ట్‌గా దొరికిన ముఠా ఎంతకాలంగా ఈ దందా చేస్తుంది..? గ్యాంగ్ వెనుక ఎవరెవరు ఉన్నారు? ఏయే ప్రాంతాల్లో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు.
డ్రగ్ కింగ్ పిన్‌తో పాటు మరో నలుగురు అరెస్టవ్వడంతో మరిన్ని వివరాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు. స్థానికంగా డ్రగ్స్ మాఫియాకు ఎవరు సహాయం అందిస్తున్నారు అనేది విచారణలో తేలనుందని పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..