‘మెట్రోరైలుతో ఓల్డ్ సిటీకి మహర్థశ.. అప్పుడే సీఎం రేవంత్ శంకుస్థాపన’: అసదుద్దీన్ ఓవైసీ

| Edited By: Ravi Kiran

Mar 02, 2024 | 9:32 PM

పాతబస్తీ మెట్రో రైలు పనులకు మార్చి 7న ఫలక్‎నుమాలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రోరైలు నడిపేందుకు గతంలో ప్రతిపాదించారు. అయితే, భూసేకరణలో సమస్యలు తలెత్తడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. తాజాగా భూసేకరణ సమస్యలు పూర్తి చేసి పనులు మొదలు పెట్టేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(HMRL) సిద్ధమైంది.

మెట్రోరైలుతో ఓల్డ్ సిటీకి మహర్థశ.. అప్పుడే సీఎం రేవంత్ శంకుస్థాపన: అసదుద్దీన్ ఓవైసీ
Asaduddin Owaisi
Follow us on

పాతబస్తీ మెట్రో రైలు పనులకు మార్చి 7న ఫలక్‎నుమాలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రోరైలు నడిపేందుకు గతంలో ప్రతిపాదించారు. అయితే, భూసేకరణలో సమస్యలు తలెత్తడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. తాజాగా భూసేకరణ సమస్యలు పూర్తి చేసి పనులు మొదలు పెట్టేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(HMRL) సిద్ధమైంది.

పాతబస్తీకి మెట్రో సేవలు విస్తరణపై తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో మెట్రో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారులు ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా మధ్య మెట్రో రైలు కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలోమీటర్ల మేర ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రూట్‎లో సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్ గంజ్, ఫలక్ నుమా ప్రాంతాల్లో మెట్రో‎స్టేషన్లు నిర్మిస్తారు. ఈ మార్గంలో 103 మతపరమైన నిర్మాణాలు ఉన్నాయని, మెట్రో విస్తరణలో భాగంగా వీటిని తొలగించాల్సి ఉంది . అయితే ఎక్కువగా కట్టడాలను కూల్చకుండా 80 అడుగుల మేర రోడ్డు విస్తరణ చేసి ఈ మార్గంలో మెట్రో పనులు ప్రారంభించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధంచేశారు.

మెట్రో రైలు తొలివిడతలో 69.2 కిలోమీటర్లు మేర మెట్రో రైలు మార్గాన్ని ఎల్‌ అండ్‌ టీ సంస్థ నిర్మించింది. అయితే పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై ఎల్ అండ్ టీ ఆసక్తి చూపలేదు. ఈ మార్గంలో మతపర కట్టడాలు ఎక్కువ ఉండడం, భూసేకరణలో సమస్యలు రావడంతో ఎల్ అండ్ టీ అప్పుడు చేతులెత్తేసింది. సుమారు 8 సంవత్సరాలుగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకూ 5.5 కిలోమీటర్ల మార్గం నిలిచిపోయింది. మతపరకట్టడాలు తొలగింపునకు గతంలో మజ్లిస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాయదుర్గంతో పాటు ఇతర ప్రాంతాల్లో సుమారు 2.7 కిలోమీటర్లు అదనంగా నిర్మించటంతో పాటు, ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా మార్గాన్ని కూడా పూర్తి చేస్తే మెట్రో రైలు మార్గం 74.7 కిలోమీటర్లు అవుతుంది.

ఇవి కూడా చదవండి

పాతబస్తీ అభివృద్ధే మా ప్రయారిటీ అని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసమే తమ పార్టీ ఓల్డ్ సిటీ అభివృద్ధిని అడ్డుకుంటోందనే అసత్య ఆరోపణలు చేస్తున్నాయని అసద్ విమర్శించారు. పాత బస్తీలో మెట్రో పనులు పూర్తి చేయండతోపాటు.. వీలైనంత త్వరగా రోడ్లు కూడా విస్తరించాలని మాకు మెట్రో నిర్మాణంలో ఎలాంటి అభ్యంతరం లేదని అసదుద్దీన్ అన్నారు. అంతే కాదు ఓల్డ్‌ సిటీలోని చంచల్ గూడ జైలును అక్కడ నుంచి తరలించి ఆ స్థానంలో కేజీ టూ పీజీ విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దీంతో పాటు సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌ని కూడా ఓట్డ్ సిటీ నుంచి తరలించి ఆ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని ఎంపీ అసద్ డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..