AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మూసీ నది ప్రక్షాళనపై సీఎం రేవంత్‌ స్పెషల్‌ ఫోకస్‌.. కీలక ఆదేశాలు..

మూసీ నది ప్రక్షాళనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. మూసీ సమగ్రాభివృద్ధిపై మరోసారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మూసీ నది సమగ్రాభివృద్ధి విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. మూసీ రివర్‌ డెపలమ్‌మెంట్‌పై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరింత దృష్టి సారించింది.

Hyderabad: మూసీ నది ప్రక్షాళనపై సీఎం రేవంత్‌ స్పెషల్‌ ఫోకస్‌.. కీలక ఆదేశాలు..
Telangana CM Revanth Reddy
Ravi Kiran
|

Updated on: Feb 20, 2024 | 11:10 AM

Share

మూసీ నది ప్రక్షాళనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. మూసీ సమగ్రాభివృద్ధిపై మరోసారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మూసీ నది సమగ్రాభివృద్ధి విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. మూసీ రివర్‌ డెపలమ్‌మెంట్‌పై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా నానక్‌రామ్‌గూడలోని HMDA కార్యాలయానికి వెళ్లారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్ బౌండరీస్, లొకేషన్ స్కెచ్‌తో పాటు పలు వివరాలను సీఎం రేవంత్‌కు వివరించారు HMDA జాయింట్‌ కమిషనర్‌, మూసీ రివర్‌ బోర్డ్‌ ఎండీ ఆమ్రపాలి. మూసీ రివర్‌ ప్రక్షాళనకు సంబంధించి కొద్దిపాటి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

ఈ సందర్భంగా.. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేలా ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్‌ రెడ్డి. అంతకన్నా ముందు మూసీని శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని సూచించారు. జంట నగరాల్లోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ది ప్రణాళికలు రూపొందించాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇక.. సీఎం రేవంత్​రెడ్డి మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఇప్పటికే అనేకసార్లు సమీక్షలు చేశారు. మూసీ నది పునరుజ్జీవనం తమ ప్రభుత్వ లక్ష్యంగా ప్రకటించారు. దానిలో భాగంగా.. తొలి విదేశీ పర్యటనలోనే లండన్​లో థేమ్స్​ ​నదిని సందర్శించారు. దుబాయిలో, హైదరాబాద్​లో మూసీ నది పునరుజ్జీవనం గురించి సమావేశాలు జరిపారు. ఆ తర్వాత.. మూసీ సుందరీకరణపై హెచ్ఎండీఏ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఆ దిశగా వేగంగా చర్యలు చేపట్టారు. అటు.. రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో బృందాలను నియమించి హద్దులను పక్కాగా గుర్తించే పనిలో పడింది మూసీ నది అభివృద్ధి సంస్థ. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపి అనుమతి కోరింది ఎంఆర్‌డీసీఎల్‌. మొత్తంగా.. లండన్​లోని థేమ్స్​ నదిని సందర్శించిన సీఎం రేవంత్‌, మూసీని కూడా అదేస్థాయిలో అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నారు.

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు