Watch: తిలక్ వర్మను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆసియా కప్ హీరో ఏం గిఫ్ట్ ఇచ్చాడో చూశారా..
ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఆసియా కప్ -2025 లో భారత జట్టును విజేతగా నిలపడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యువ క్రికెటర్ తిలక్ వర్మను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.

ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఆసియా కప్ -2025 లో భారత జట్టును విజేతగా నిలపడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యువ క్రికెటర్ తిలక్ వర్మను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ చేరుకున్న క్రికెటర్ తిలక్ వర్మ.. మంగళవారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను, కోచ్ సలాం బయాష్‌ను ముఖ్యమంత్రి సత్కరించారు. తిలక్ వర్మ తన క్రికెట్ బ్యాట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ క్రీడా ప్రాథికార సంస్థ చైర్మన్ శివసేనరెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వీడియో చూడండి..
అంతకుముందు ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ రేపిందన్నారు. టీమ్ ఇండియా ఈ అద్భుత విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవం తీసుకొచ్చారని ప్రశంసించారు.
ఆసియా కప్ -2025 లో భారత జట్టును విజేతగా నిలపడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యువ క్రికెటర్ తిలక్ వర్మను ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అభినందించారు.
❇️హైదరాబాద్ చేరుకున్న @TilakV9 జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను,… https://t.co/qB7Cbh6Kt6 pic.twitter.com/4Fd0nrxKQ8
— Telangana CMO (@TelanganaCMO) September 30, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




