Revanth Reddy: సోనియా, మన్మోహన్‌ను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువబోరు: సీఎం రేవంత్ రెడ్డి
ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలోని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా.. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్ గా ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 33 కలెక్టరేట్లలో రూ.5.8 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలోని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా.. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్ గా ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 33 కలెక్టరేట్లలో రూ.5.8 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 18 అడుగుల ఎత్తుతో రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ పుట్టిన రోజున.. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన రోజని.. ఇది కలకాలం గుర్తుంటుందని పేర్కొన్నారు. 4 కోట్లమంది ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ నిర్ణయం తీసుకున్న రోజును.. తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా నిర్ణయించామని తెలిపారు. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్‌గా మార్చామన్నారు. సోనియా, మన్మోహన్‌ను ఎప్పటికీ తెలంగాణ ప్రజలు మరువబోరని.. సీఎం రేవంత్ తెలిపారు. 6 దశాబ్దాల ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఏటా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలతో పాటు, సోనియా గాంధీ జన్మదిన ఉత్సవాలను తెలంగాణ ప్రజలు నిర్వహించుకుంటారని.. తెలంగాణ పథకాలు, కార్యక్రమాల్లో సోనియా గాంధీ, మన్మోహన్ స్ఫూర్తి కొనసాగుతోందని.. రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆస్థిత్వానికి ప్రతీకగా, పరిపాలనకు స్ఫూర్తిదాయకంగా నిలిచే తెలంగాణ తల్లి విగ్రహాలను అన్ని జిల్లాల పరిపాలన కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో గొప్ప సందర్భమని సీఎం అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
