AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రూపాయ్‌కే టిఫిన్.. ఎక్కడో కాదు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర.. టైమింగ్స్ ఇవే

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రోజూ ఉదయం ఓ పెద్ద క్యూ కనబడుతోంది. అదేదో సినిమా టికెట్ల కోసమో, ఏ వైన్ షాపులో మందు కోసమో ఏర్పడింది కాదు. కేవలం రూపాయికి అల్పాహారం పెడుతూ ఎంతో మంది ఆకలిని తీరుస్తున్న ఓ ఆదర్శవంతుడు పెట్టే పట్టెడు అన్నం కోసం..

Telangana: రూపాయ్‌కే టిఫిన్.. ఎక్కడో కాదు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర.. టైమింగ్స్ ఇవే
Hyderabad
Noor Mohammed Shaik
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 09, 2025 | 11:45 AM

Share

కూటి కోసం కోటి విద్యలు అనే సామెత వినే ఉంటారు.. జానెడు పొట్ట నింపుకోవడానికి రాత్రనక పగలనక ఎన్నెన్నో పనులు చేస్తూ కష్టపడే వాళ్లను చూశాం.. కానీ ఇక్కడ తాను కష్టపడుతూ ఆకలితో ఉన్న పది మంది పొట్ట నింపుతున్నాడు ఓ వ్యక్తి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రోజూ ఉదయం ఓ పెద్ద క్యూ కనబడుతోంది. అదేదో సినిమా టికెట్ల కోసమో, ఏ వైన్ షాపులో మందు కోసమో ఏర్పడింది కాదు. కేవలం రూపాయికి అల్పాహారం పెడుతూ ఎంతో మంది ఆకలిని తీరుస్తున్న ఓ ఆదర్శవంతుడు పెట్టే పట్టెడు అన్నం కోసం. పేద ప్రజల కడుపు నింపుతూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న ఆ మహోన్నత వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం.

జార్జ్ రాకేష్ బాబు.. ఒక రూపాయికి మాత్రమే పేద ప్రజలకు అల్పాహారం అందిస్తూ, ఎంతో మందికి బతుకుపై ఆశ కల్పిస్తున్నాడు. తన కరుణ కిచెన్ చొరవ ద్వారా కేవలం ఒక రూపాయికే పేదలకు తాజా అల్పాహారం అందిస్తున్నారు. రైల్వే స్టేషన్ నీడలో వచ్చీపోయే ఎందరో ప్రయాణికులు, స్థానికంగా ఉండే పేదలు ఈ ఒక్క రూపాయికే అల్పాహారం అందుకుని సంతృప్తిగా కడుపు నింపుకుంటున్నారు. రెండు నెలల క్రితం మనోహర్ థియేటర్ సమీపంలో ప్రారంభించబడిన ఈ అల్పాహార సేవ ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు దాదాపు 250 మందికి సేవలు అందిస్తోంది. అలా అని రోజూ ఒకే రకమైన అల్పాహారం ఉండదు. మెనూ ప్రతిరోజూ మారుతుంది. ఉప్మా మరియు సాంబార్, లేదా గుడ్డు, అరటిపండు మరియు బ్రెడ్ – మరియు టీ కూడా ఇక్కడ కేవలం ఒక రూపాయికే లభిస్తుంది. ఇందుకోసం ముందుగా టోకెన్లు అందిస్తారు.. ఆ టోకెన్లు ఉన్నవారికే కాకుండా, ఆ ఒక్క రూపాయి కూడా చెల్లించలేని వారు ఎవరైనా ఉన్నా సంకోచం లేకుండా వడ్డిస్తారు. గతేడాది రాకేష్ బాబు.. ఒక రూపాయికి మధ్యాహ్న భోజన సేవను ప్రారంభించారు. అలా చిన్నగా మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు దాదాపు 350 మందికి సేవలు అందిస్తోంది. వీరిలో చాలామంది రోజువారీ కూలీ కార్మికులు, వలస కార్మికులు మరియు ఆటో-రిక్షా డ్రైవర్లు.. ఇలా ఎన్నో రకాల మనుషులు ఉంటారు.

ఇంత గొప్ప కార్యానికి పూనుకుని, ఎంతో మంది కడుపు నింపుతున్న రాకేష్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘అల్పాహారం రోజులో అతి ముఖ్యమైన భోజనం. అయినప్పటికీ చాలా మంది పని ఒత్తిడి లేదా ఆర్థిక పరిమితుల కారణంగా దానిని దాటవేస్తారు. గత సంవత్సరం నుంచి నేను ఒక రూపాయికే మధ్యాహ్న భోజనం అందించడం మొదలుపెట్టాను. వేలాది మంది రోజువారీ కూలీ కార్మికులు మరియు వలస కార్మికులు ప్రయాణించే సికింద్రాబాద్‌లో అల్పాహారం ప్రారంభిస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నా. అల్పాహారం తాజాగా మరియు పరిశుభ్రతగా ఉండడానికి బయట ఎక్కడో కాకుండా నా సొంత ఇంట్లోనే వండిస్తాను. పేద ప్రజలు కడుపు నిండా తినాలనే ఉద్దేశ్యంతో అందరి నుంచి ఒక రూపాయి మాత్రమే వసూలు చేస్తాను’ అని తెలిపాడు. ఇలా రూపాయికే అల్పాహారం అందించడం అనే ప్రక్రియ తన సొంత పొదుపుతోనే ప్రారంభమైందని, కానీ త్వరలోనే ఇది ఎంతో మంది మద్దతు పొందిందని చెప్పుకొచ్చాడు. అందుకు గాను చాలా మంది దాతలు ముందుకొచ్చి తమకి తోచినంతలో 10 రూపాయలు, 50 రూపాయలు లేదా 100 రూపాయలు విరాళంగా ఇస్తారు. దయహృదయంతో ఇచ్చే ఆ కొంచెం డబ్బు అయినా ఒక రోజులో ఎంతో మందికి భోజనం వండడానికి సరిపోతుందని చెబుతున్నాడు. మరి కొంతమంది డబ్బు రూపేణా కాకుండా వంట సామాగ్రిని కూడా విరాళంగా ఇస్తారనీ.. ఈ చొరవను నగరంలోని మరిన్ని ప్రముఖ ప్రాంతాలకు విస్తరించాలని అనుకుంటున్నామని జార్జి రాకేష్ బాబు చెబుతున్నాడు.

రూపాయ్‌కే టిఫిన్.. ఎక్కడో కాదు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర
రూపాయ్‌కే టిఫిన్.. ఎక్కడో కాదు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర
ఆసక్తికరంగా తరుణ్ భాస్కర్ మూవీ టీజర్..
ఆసక్తికరంగా తరుణ్ భాస్కర్ మూవీ టీజర్..
ఇండిగో ఎఫెక్ట్.. విమాన టికెట్ ధరలకు కేంద్రం కళ్లెం
ఇండిగో ఎఫెక్ట్.. విమాన టికెట్ ధరలకు కేంద్రం కళ్లెం
మీ అరచేతిలో ఈ రేఖ ఉంటే అందమైన భార్యను పొందుతారా.? హస్త సాముద్రికం
మీ అరచేతిలో ఈ రేఖ ఉంటే అందమైన భార్యను పొందుతారా.? హస్త సాముద్రికం
సౌతాఫ్రికా టీ20 సిరీస్ ముందు అభిషేక్ శర్మ సంచలనం
సౌతాఫ్రికా టీ20 సిరీస్ ముందు అభిషేక్ శర్మ సంచలనం
గోళ్లపై కనిపించే తెల్లని మచ్చలు భవిష్యత్తును సూచిస్తాయా.?
గోళ్లపై కనిపించే తెల్లని మచ్చలు భవిష్యత్తును సూచిస్తాయా.?
కారు మైలేజ్ తగ్గడానికి 5 ప్రధాన కారణాలు ఇవే.. మరి ఎలా?
కారు మైలేజ్ తగ్గడానికి 5 ప్రధాన కారణాలు ఇవే.. మరి ఎలా?
తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్.. అసలు మ్యాటర్
తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్.. అసలు మ్యాటర్
మేష రాశి స్త్రీలు అలాంటివారినే భర్తగా కోరుకుంటారు.? లక్షణాలు ఎలా?
మేష రాశి స్త్రీలు అలాంటివారినే భర్తగా కోరుకుంటారు.? లక్షణాలు ఎలా?
హెలికాఫ్టర్‌లో పుట్టింటికి వెళ్లి.. శుభలేఖలు పంచిన మహిళ
హెలికాఫ్టర్‌లో పుట్టింటికి వెళ్లి.. శుభలేఖలు పంచిన మహిళ