Hyderabad: అటెన్షన్ ప్లీజ్.! హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్.. నిజమండీ బాబూ.. నమ్మలేకపోతున్నారా
హైదరాబాద్‌లో మరో ప్రధాన ఆడంబరం టన్నెల్ అక్వేరియం రూపంలో కనిపించనుంది. దుబాయ్, సింగపూర్ తరహాలో నీటి అడుగున నడుస్తూ సముద్ర జీవులను దగ్గరగా చూసే అనుభూతిని అందించేందుకు రూ. 300 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు ముందుకు వస్తోంది. కెడాల్ సంస్థ ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది.

నగరవాసుల విహారయాత్రలకు భారీ మార్పులు రానున్నాయి. ఇకపై సముద్ర తీరాల్ని చేరుకునేంత దూర ప్రయాణం అవసరం లేకుండానే బీచ్ అనుభూతి హైదరాబాద్‌లోనే అందుబాటులోకి రానుంది. గ్లోబల్ సదస్సు సందర్భంగా పలు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఎంవోయూలు కుదుర్చుకోనుండగా, వినోదం నుంచి సాంస్కృతిక రంగం వరకు అనేక కొత్త ప్రాజెక్టులు నగర రూపురేఖలను మార్చేలా సిద్ధమవుతున్నాయి. కొత్వాల్గూడలో 35 ఎకరాల విస్తీర్ణంలో కృత్రిమ బీచ్ ఏర్పాటు చేయబోతున్నారు. సుమారు ₹235 కోట్ల వ్యయంతో రూపొందనున్న ఈ ప్రాజెక్టుకు స్పెయిన్ కంపెనీలు సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. సాధారణ ప్రజలకు సౌకర్యవంతమైన చార్జీలతో బీచ్‌లో స్నానం, బోటింగ్ వంటి వినోదాలను ఆస్వాదించే అవకాశముంటుంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్, ప్రత్యేక ఈవెంట్ల కోసం కూడా ఏర్పాట్లు చేయనున్నారు.
హైదరాబాద్‌లో మరో ప్రధాన ఆడంబరం టన్నెల్ అక్వేరియం రూపంలో కనిపించనుంది. దుబాయ్, సింగపూర్ తరహాలో నీటి అడుగున నడుస్తూ సముద్ర జీవులను దగ్గరగా చూసే అనుభూతిని అందించేందుకు రూ. 300 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు ముందుకు వస్తోంది. కెడాల్ సంస్థ ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక భారత్ ఫ్యూచర్ సిటీలో వెయ్యి కోట్ల విలువైన అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రం నెలకోనుంది. ప్రపంచ దేశాల కళలు, సంస్కృతి, ప్రదర్శనలు, సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి వచ్చేలా ఈ కేంద్రాన్ని రూపుదిద్దుతున్నారు. అదే ప్రాంతంలో ప్రేక్షకులు ప్రత్యేకంగా రూపొందించిన కుర్చీల్లో కూర్చుని, తాము చూస్తున్న దృశ్యంలో ఉన్నట్టుగా అనుభూతి పొందే ఫ్లయింగ్ థియేటర్ కూడా ఏర్పాటు కానుంది.
పర్యాటక రంగానికి ఊతం ఇవ్వడానికి వికారాబాద్‌లో క్యారవాన్ పార్కు ఏర్పాటయ్యే దిశగా చర్యలు వేగంగా సాగుతున్నాయి. క్యారవాన్ ప్రయాణికులకు పార్కింగ్, ఇలెక్ట్రిక్ వాహన చార్జింగ్, ఆహారం, వ్యూయ్‌టవర్ వంటి సేవలు 24 గంటలపాటు అందుబాటులో ఉండనున్నాయి. ఇంకా పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలను పెంచడానికి స్కూల్ ఆఫ్ టూరిజం ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ ప్రాజెక్ట్స్ (STEPS) అనే ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. చారిత్రక కోటల వద్ద రెంటల్ కాస్ట్యూమ్స్ వంటి క్రియేటివ్ పర్యాటక సేవలను అభివృద్ధి చేసే ప్రాజెక్టులను కూడా ప్రోత్సహించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే, హైదరాబాద్ దేశంలోని ప్రధాన టూరిజం హబ్‌గా మరింత బలపడే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిస్తోంది.
