CM KCR: మ‌రికాసేప‌ట్లో గాంధీ ఆస్ప‌త్రికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్… స్వ‌యంగా ప‌రిస్థితిని తెలుసుకోనున్న సీఎం

|

May 19, 2021 | 12:21 PM

మ‌రికాసేప‌ట్లో గాంధీ ఆస్ప‌త్రికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. సీఎం హోదాలో గాంధీకి వెళ్ల‌నున్నారు కేసీఆర్.

CM KCR: మ‌రికాసేప‌ట్లో గాంధీ ఆస్ప‌త్రికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్... స్వ‌యంగా ప‌రిస్థితిని తెలుసుకోనున్న సీఎం
Cm Kcr
Follow us on

మ‌రికాసేప‌ట్లో గాంధీ ఆస్ప‌త్రికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. సీఎం హోదాలో గాంధీకి వెళ్ల‌నున్నారు కేసీఆర్. ఆస్పత్రిలో కొవిడ్‌ చికిత్సలు, ఇతర సదుపాయాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం అక్కడి వైద్యులతో సీఎం సమీక్ష నిర్వహించి పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపైనా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆక్సిజన్‌ వసతి, ఔషధాల సరఫరా తదితర అంశాలపై వారితో చర్చించనున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ దగ్గరే వైద్య, ఆరోగ్యశాఖ ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ శాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో ప్ర‌స్తుతం 1500 మంది క‌రోనా రోగులు చికిత్స పొందుతున్నారు. కరోనా పేషెంట్ల‌తో సీఎం కేసీఆర్ నేరుగా మాట్లాడ‌నున్నారు.  గ‌త నెల‌లో గాంధీ హాస్పిటల్ ను పూర్తి స్థాయి కోవిడ్ హాస్పిటల్ గా మార్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఓపీ సేవలు నిలిపి వేసి కేవలం క‌రోనా కేసులకు మాత్రమే చికిత్స ఇస్తున్నారు. ఏప్రిల్‌ 17 నుంచి గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చుతున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ పేర్కొంది. టిమ్స్ ను కూడా సీఎం కేసీఆర్ సంద‌ర్శించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 

Also Read:  అమాన‌వీయం.. చిత్తూరు జిల్లాలో కోళ్ల లారీకి యాక్సిడెంట్.. మ‌నుషులు చ‌నిపోయినా ప‌ట్టించుకోకుండా…

 ఇకపై తెలంగాణలో విద్యుత్ బిల్లులు చెల్లింపు కౌంటర్లు మధ్యాహ్నం 12 గంటల వరకూ పనిచేస్తాయి..