Hyderabad: స్కూలే కాదు.. ట్యూషన్‌లోనూ విద్యార్థుల పాలిట యములైన టీచర్స్.. సరిగ్గా చదవట్లదేని ఏకంగా..
స్కూల్‌లోనే కాదు.. ట్యూషన్‌లోనూ విద్యార్థులకు తిప్పటు తప్పడం లేదు. హైదరాబాద్‌లో ఓ ట్యూషన్ టీచర్ ఏడేళ్ల చిన్నారిపై రాక్షసంగా ప్రవర్తించింది. సరిగ్గా చదవడం లేదన్న కారణంతో అట్లకాడను వేడి చేసి బాలుడికి వాతలు పెట్టింది. దీంతో ఆ అబ్బాయికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన ఫిల్మ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

సరిగ్గా చదవడం లేదన్న కారణంతో ఒకటో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడికి అట్లకాడతో ట్యూషన్ టీచర్ వాత పెట్టిన ఘటన హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ పీఎస్ పరిధితో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట ఓయూ కాలనీకి చెందిన ఏడేళ్ల బాలుడు ఒకటవ తరగతి చదువుతున్నాడు. గురువారం సాయంత్రం అతడిని ట్యూషన్‌కు పంపిన తల్లిదండ్రులకు ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేకపోయారు. స్థానికంగా ట్యూషన్ చెప్పే టీచర్ శ్రీమానస.. బాలుడు పాఠాలను సరిగా చెప్పలేదనే కారణంతో అట్లకాడను వేడి చేసి అతడి చేతులు, కాళ్లు, ముఖం మీద వాతలు పెట్టినట్లు తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.
దీంతో బాలుడు శరీరంపై ఎనిమిది చోట్ల తీవ్రమైన కాలిన గాయాలు ఏర్పడ్డాయి. శరీరంపై గాయాలు తీవ్రంగా ఉండడంతో అతడు నడవలేని స్థితికి చేరుకున్నాడు. ఫిర్యాదు అందుకున్న ఫిల్మ్‌నగర్ పోలీసులు చిన్నారిని వెంటనే గోల్కొండ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు కాలిన గాయాలను పరీక్షించి చికిత్స అందిస్తున్నారు.
తమ కుమారుడిపై ఇంత అమానుషంగా వ్యవహరించిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు బాలుడి తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు బాధ్యురాలైన ట్యూషన్ టీచర్ శ్రీమానసను అరెస్ట్ చేయలేదని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




