Hyderabad: జూబ్లీహిల్స్‌లో కారు ప్రమాదం.. అతివేగంతో డివైడర్‌ని ఢీకొని..

| Edited By: శివలీల గోపి తుల్వా

Jul 08, 2023 | 1:27 PM

Hyderabad: అతివేగం ప్రమాదకరమని ఎన్నిసార్లు హెచ్చరించిన వాహనదారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. చేతిలో వాహనం ఉంటే చాలు రైయమంటూ దూసుకెళ్తున్నారు జూబ్లీహిల్స్ లో నిద్రమత్తులో కారు బోల్తా పడిన ఘటన మరవక ముందే మరొక కారు అతివేగంగా..

Hyderabad: జూబ్లీహిల్స్‌లో కారు ప్రమాదం.. అతివేగంతో డివైడర్‌ని ఢీకొని..
Accident Visuals
Follow us on

Hyderabad: అతివేగం ప్రమాదకరమని ఎన్నిసార్లు హెచ్చరించినా వాహనదారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. చేతిలో వాహనం ఉంటే చాలు రైయమంటూ దూసుకెళ్తున్నారు జూబ్లీహిల్స్ లో నిద్రమత్తులో కారు బోల్తా పడిన ఘటన మరవక ముందే మరొక కారు అతివేగంగా వచ్చి డివైడర్ ఢీకొని బోల్తా పడింది.  అయితే కారులో ప్రయాణించే వ్యక్తి మద్యం సేవించి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు రాత్రులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు ఎన్నిసార్లు నిర్వహించిన ఎన్ని చర్యలు తీసుకున్న మందు బాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో ప్రమాదాలు ఎక్కువగా మద్యం సేవించి రాష్ట్ర డ్రైవింగ్ చేయడం లేదంటే అతివేగంగా వచ్చి ప్రమాద భారిన పడడం ఇవే తరచుగా జరుగుతున్నాయి.

జూబ్లీహిల్స్‌లో కారు ప్రమాదం బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు రోడ్డు నెంబర్ 45, గీతా ఆర్ట్స్ ఆఫీస్ సమీపంలో డివైడర్‌ను డీకొని బోల్తా పడింది..మథ్యం మత్తులో అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా కారు నడిపి ఉంటాడని భావిస్తున్నరు పోలీసులు.. కారు నడిపిన వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

-పెద్దప్రోలు జ్యోతి, టీవీ9 రిపోర్టర్, హైదరాబాద్

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.