
హైదరాబాద్, సెప్టెంబర్ 17: సోదరుడి వైద్యం కోసం వచ్చిన యువతిపై ఓ కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.. లిఫ్ట్ లో వెళ్తున్న యువతని బలవంతంగా లాక్కెళ్ళి అత్యాచారం చేశాడు.. సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్ క్యాంటీన్ లో పని చేసే షాదాబ్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. వందల మంది వైద్య సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్న హాస్పిటల్ లోనే ఇలాంటి దారుణం జరగడంపై పేషంట్ అటెండర్స్ ఆందోళనకు గురి అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిథిలోని ఈఎస్ఐ హాస్పిటల్ క్యాంటీన్లో పని చేసే షాబాద్ అనే యువకుడు యువతీపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతి ఈ నెల 6న తన సోదరుడిని ఈఎస్ఐ హాస్పిటల్లో చేర్పించింది. అప్పటి నుండి యువతి తన సోదరుని కోసం హాస్పిటల్ వద్దే ఉంటుంది. ఈ క్రమంలో నిన్న రాత్రి వేళ భోజనం తీసుకు వచ్చేందుకు క్యాంటీన్ వద్దకు వెళ్లిన యువతి తిరిగి వస్తుండగా.. లిఫ్ట్ వద్ద సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఆమెన తన సోదరుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. అలాగే క్యాంటీన్లో పని చేస్తున్న షాదాబ్ అనే యువకుడిని ఆ యువతికి పరిచయం చేశాడు.
అలా పరిచయమైన షాదాబ్ అప్పుడే ఆ యువతికి ఒక కోడి గుడ్డు ఇచ్చి తినమన్నాడు. అది తినేసి లిఫ్ట్లో సోదరుడి వద్దకు వెళ్ళిపోతున్న సమయంలో అమెతో పాటే వచ్చిన షాదాబ్ బలవంతంగా తనను రెండో ఫ్లోర్లో ఉన్న చీకటి ప్రదేశంలోకి తీసుకొని వెళ్ళాడు. అనంతరం ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి హాస్పిటల్లో ఉన్న సిబ్బందికి విషయం తెలియజేసింది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు షాదాబ్‌పై కేసు నమోదు చేసుకుని, అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..