Hyderabad Chinthal News: అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. జస్ట్ చిన్న తప్పిదం.. పెను ప్రమాదం.. దీంతో హైదరబాద్ చింతల్‌లో టెన్షన్.. టెన్షన్.. నెలకొంది. హైదరాబాద్ చింతల్‌లోని శ్రీనివాస్‌నగర్‌లో భవనం యాజమాని తన ఇంటిని ఎత్తు పెంచడానికి ప్రయత్నించారు. అంతా బాగానే ఉంది.. పనులు కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో ఇంటి కింద అమర్చిన హైడ్రాలిక్ జాకీలు ఒక పక్కకు జరగాయి. దీంతో ఈ ఇల్లు పక్కనున్న భవనంపైకి వాలింది. ఆందోళన చెందిన స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. భవనం పక్కకు వాలిపోయిందని తెలియగానే ఆ రెండు ఇళ్లలో నివాసం ఉండే వారంతా బయటకు వచ్చేశారు.
స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్‌కి చెందిన నాగేశ్వరరావు 25 ఏళ్ల కిందట శ్రీనివాస్‌నగర్‌లో ఇల్లు కట్టించారు. ప్రస్తుతం ఆ భవనం ఎత్తు తక్కువగా ఉందని భావించి, తన ఇంటిని జాకీలతో ఒకటిన్నర ఫీట్ ఎత్తు పెంచడానికి శనివారం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇంటి కింద అమర్చిన జాకీలు అదుపు తప్పాయి. దీంతో ఇల్లు పక్కింటి భవనంపై వాలిపోయింది. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించి, సహాయక చర్యలు చేపట్టారు.
ఇంటి ఎత్తు పెంచాలని ప్రయత్నించగా విపలమైంది. ఆ ఇళ్లు పక్కనున్న భవనంపై వాలిపోయిందని కుత్బుల్లాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఐతే బిల్డింగ్ కూల్చేయాలా..? జాక్‌ల సహాయంతో సరిచేయాలా..? అని ఆలోచిస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులు వచ్చాక ఓ నిర్ణయం తీసుకొని బిల్గింగ్‌ను కూల్చివేయాలనే యోచనలో ఉన్నారు టౌన్‌ప్లానింగ్ అధికారులు. మరో అవకాశం ఇస్తే హైడ్రాలిక్ జాక్‌లతో బిల్డింగ్‌ను సరిచేస్తామంటున్నారు నిపుణులు. అయితే, ప్రస్తుతం ఈ రెండు భవనాలు ప్రమాదకరంగా మారడంతో.. గంటల వ్యవధిలోనే ఏదో ఒక నిర్ణయానికి రావాలని అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..