AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. జాకీలు అదుపు తప్పడంతో చింతల్‌లో టెన్షన్.. టెన్షన్..

Hyderabad Chinthal News: అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. జస్ట్ చిన్న తప్పిదం.. పెను ప్రమాదం.. దీంతో హైదరబాద్ చింతల్‌లో టెన్షన్.. టెన్షన్.. నెలకొంది. హైదరాబాద్‌ చింతల్‌లోని శ్రీనివాస్‌నగర్‌లో భవనం యాజమాని తన ఇంటిని ఎత్తు పెంచడానికి ప్రయత్నించారు.

Hyderabad: అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. జాకీలు అదుపు తప్పడంతో చింతల్‌లో టెన్షన్.. టెన్షన్..
Hyderabad News
Shaik Madar Saheb
|

Updated on: Jun 25, 2023 | 9:31 AM

Share

Hyderabad Chinthal News: అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. జస్ట్ చిన్న తప్పిదం.. పెను ప్రమాదం.. దీంతో హైదరబాద్ చింతల్‌లో టెన్షన్.. టెన్షన్.. నెలకొంది. హైదరాబాద్‌ చింతల్‌లోని శ్రీనివాస్‌నగర్‌లో భవనం యాజమాని తన ఇంటిని ఎత్తు పెంచడానికి ప్రయత్నించారు. అంతా బాగానే ఉంది.. పనులు కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో ఇంటి కింద అమర్చిన హైడ్రాలిక్ జాకీలు ఒక పక్కకు జరగాయి. దీంతో ఈ ఇల్లు పక్కనున్న భవనంపైకి వాలింది. ఆందోళన చెందిన స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. భవనం పక్కకు వాలిపోయిందని తెలియగానే ఆ రెండు ఇళ్లలో నివాసం ఉండే వారంతా బయటకు వచ్చేశారు.

స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్‌కి చెందిన నాగేశ్వరరావు 25 ఏళ్ల కిందట శ్రీనివాస్‌నగర్‌లో ఇల్లు కట్టించారు. ప్రస్తుతం ఆ భవనం ఎత్తు తక్కువగా ఉందని భావించి, తన ఇంటిని జాకీలతో ఒకటిన్నర ఫీట్ ఎత్తు పెంచడానికి శనివారం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇంటి కింద అమర్చిన జాకీలు అదుపు తప్పాయి. దీంతో ఇల్లు పక్కింటి భవనంపై వాలిపోయింది. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించి, సహాయక చర్యలు చేపట్టారు.

ఇంటి ఎత్తు పెంచాలని ప్రయత్నించగా విపలమైంది. ఆ ఇళ్లు పక్కనున్న భవనంపై వాలిపోయిందని కుత్బుల్లాపూర్‌ టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఐతే బిల్డింగ్ కూల్చేయాలా..? జాక్‌ల సహాయంతో సరిచేయాలా..? అని ఆలోచిస్తున్నారు. ఇంజనీరింగ్‌ అధికారులు వచ్చాక ఓ నిర్ణయం తీసుకొని బిల్గింగ్‌ను కూల్చివేయాలనే యోచనలో ఉన్నారు టౌన్‌ప్లానింగ్ అధికారులు. మరో అవకాశం ఇస్తే హైడ్రాలిక్‌ జాక్‌లతో బిల్డింగ్‌ను సరిచేస్తామంటున్నారు నిపుణులు. అయితే, ప్రస్తుతం ఈ రెండు భవనాలు ప్రమాదకరంగా మారడంతో.. గంటల వ్యవధిలోనే ఏదో ఒక నిర్ణయానికి రావాలని అధికారులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్
వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్
పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..
పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..