MP Keshava Rao: ఎంపీ కేశవరావు కొడుకులపై భూకబ్జా కేసు.. పోలీసుల గాలింపు

| Edited By: Srilakshmi C

Jul 19, 2023 | 9:17 AM

బీఆర్‌ఎస్‌ కీలక నేత, రాజ్యసభ ఎంపీ కే కేశవరావు కొడుకులపై నమోదైన చీటింగ్ కేసుతోపాటు ఫోర్జరీ కేసు సంచలనం రేపింది. టిఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలకమైన నేతగా ఉన్న కేశవరావు కొడుకులపైనే భూకబ్జా కింద కేసు నమోదు కావడం..

MP Keshava Rao: ఎంపీ కేశవరావు కొడుకులపై భూకబ్జా కేసు.. పోలీసుల గాలింపు
BRS MP Keshava Rao
Follow us on

హైదరాబాద్‌, జూలై 19: బీఆర్‌ఎస్‌ కీలక నేత, రాజ్యసభ ఎంపీ కే కేశవరావు కొడుకులపై నమోదైన చీటింగ్ కేసుతోపాటు ఫోర్జరీ కేసు సంచలనం రేపింది. టిఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలకమైన నేతగా ఉన్న కేశవరావు కొడుకులపైనే భూకబ్జా కింద కేసు నమోదు కావడం గమనార్హం.

ఫోర్జరీ కేసులో సంచలనాలు

హైదరాబాదులో అత్యంత విలువైన 300 కోట్ల భూమిని ఐదు లక్షలకే తమ పేరున రాయించుకున్న ఆరోపణల కింద కేకే కొడుకుల పైన బంజారా హిల్స్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక ఎన్నారై ఒక లేడీ సంతకం ఫోర్జరీ చేయడమే కేకే కొడుకుల తీవ్ర నేరంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు కేకే కొడుకు విప్లవ్ కుమార్, వెంకటేశ్వరరావు పై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు బంజరహిల్స్ పోలీసులు.ఎన్నారై జయమాల సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేకే కుమారులు , బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్న రెండు సర్వే నంబర్ లోని భూములను ఎన్ఆర్ఐ తమకు అమ్మినట్టు సేల్ డీడ్ క్రియేట్ చేసుకున్నట్టు విచారణలో తేలింది. 2013లో సేల్ డీడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసారు విప్లవ్, వెంకటేశ్వర రావు. బహిరంగ మార్కెట్ విలువ 2.13 కోట్లు ఉంటే 3 లక్షల కే అమ్మినట్టు ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అడ్డంగా బుక్ అయ్యారు. దీంతో ఎన్నారై జయమాలకు ఇన్కమ్ టాక్స్ నోటీస్ రావడం తో ఆమె అవాక్కయింది. ఆ భూమి ఓనర్ భా ఉన్న జయమాల కి 2.13 కోట్లు ఫైన్ వేయడం తో అసలు ఇష్యూ బయటకు వచ్చింది. విషయం తెలుసుకుని అవాక్కైన ఎన్నారై జయమాల ,తన సంతకం ఫోర్జరీ చేశారని గ్రహించి బంజర హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టునశ్రయించి ది, నాంపల్లి రిఫరెన్స్ తో కేసు నమోదు చేశారు.

కేకే ఫ్యామిలీలో అంతా లీడర్లే

భూకబ్జా ఆరోపణల తర్వాత కేకే ఫ్యామిలీ పై మరోసారి చర్చ జరుగుతుంది. మొదటినుంచి కేకే ఫ్యామిలీ వివాదాల్లోనే ఉంది. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఆంధ్రప్రదేశ్ పిసిసిగా పనిచేసిన కే కేశవరావు కొడుకు వెంకట్ ఇంట్లో కాల్పుల కలకలం హైదరాబా ద్ లో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. పీసీసీ చీఫ్ కొడుకు గా కాల్పులు జరిపిన వ్యవహారంతో ఒకసారిగా అందరూ అవాక్కయ్యారు. ఇంట్లో జరిగిన రియల్ ఎస్టేట్ గొడవ కారణంగానే వెంకట్ కాల్పులు జరిగినట్టుగా పోలీసుల విచారణలో బయటపడింది. ఇక తర్వాత కేకే కూతురు విజయలక్ష్మి సైతం వరుస వివాదాల్లో ఇరుక్కుంటారు. ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, ఆమె చేసిన అనేక కామెంట్లు తీవ్ర దుమారని లేపాయి. ఒకసారి హైదరాబాద్లో కుక్కల విషయంలో జరిగిన చర్చలో ఆమె చేసిన రచ్చ అంత ఇంతా కాదు. ఆమె వ్యవహారంలో రాంగోపాల్ వర్మ కి ఆమెకు మధ్య తీవస్తాయిలో ట్విట్టర్ వార్ జరిగింది.

ఇవి కూడా చదవండి

కేకే కుటుంబం పై చర్యలు ఉంటాయా?

కేకే రాజ్యసభ ఎంపీగా ఉండగా ఆయన కుమారుడు విప్లవ్ తెలంగాణ ప్రభుత్వం లో కీలక కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. దాంతోపాటు కేకే కూతురు విజయలక్ష్మి ఆమె హైదరాబాద్ నియర్ గా పనిచేస్తున్నారు. మేయర్ గా పనిచేస్తున్నారు. ఇంతటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కలిగి ఉన్న కేకే ఫ్యామిలీని పోలీసులు టచ్ చేస్తారా లేదా అన్న చర్చ ఇప్పుడు సర్వత్ర నెలకొంది 7 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు కేకే కొడుకుల ఆచూకీ బయటకు రావడం లేదు. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు మాత్రం నమోదు చేయగలిగారు కానీ చర్యలు తీసుకుంటారా లేదా అన్న దానిపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నోటీసులు ఇచ్చి కేకే కొడుకులను విచారిస్తామని పోలీసులు ఒకవైపు చెప్తున్నప్పటికీ కొడుకులు ఈ విషయం పైన మాట్లాడడానికి అందుబాటులో లేరు. వాళ్లు పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇంతకీ కేకే కొడుకుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.