Harish Rao: ఇదేం ఇందిరమ్మ రాజ్యం.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని ఖండించిన హరీష్ రావు..

|

Sep 12, 2024 | 3:34 PM

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హుజురాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మధ్య సవాళ్ల పర్వంతో హైటెన్షన్‌ పొలిటికల్‌ ఫైట్‌ నడుస్తోంది. అరికెపూడి గాంధీతోపాటు ఆయన అనుచురులు కౌశిక్‌రెడ్డి ఇంటికి భారీగా చేరుకోవడంతో రణరంగంగా మారింది.

Harish Rao: ఇదేం ఇందిరమ్మ రాజ్యం.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని ఖండించిన హరీష్ రావు..
Arekapudi Gandhi vs Kaushik Reddy
Follow us on

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హుజురాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మధ్య సవాళ్ల పర్వంతో హైటెన్షన్‌ పొలిటికల్‌ ఫైట్‌ నడుస్తోంది. అరికెపూడి గాంధీతోపాటు ఆయన అనుచురులు కౌశిక్‌రెడ్డి ఇంటికి భారీగా చేరుకోవడంతో రణరంగంగా మారింది. కౌశిక్‌రెడ్డి ఇంటిలోకి దూసుకెళ్లడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ అనుచురులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఒక్కసారిగా కౌశిక్‌రెడ్డి ఇంటిలోకి దూసుకెళ్లిన అరికెపూడి గాంధీ అనుచరులు.. టమాటాలు, కోడిగుడ్లతో దాడికి చేశారు. కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర రెండు వర్గాల అనుచరుల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. అరికెపూడి గాంధీ అనుచరులు కౌశిక్‌రెడ్డి ఇంటిపై రాళ్లు విసరడంతో ఆయన ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. కూకట్‌పల్లి నుంచి కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి ఇంటికి చేరుకున్న గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. అయితే.. ఆయన అనుచరులు మాత్రం ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడడంతో సెక్యూరిటీ గేట్‌ విరిపోయింది. కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఇంటి ముందు బైఠాయించారు అరికెపూడి గాంధీ. దమ్ముంటే ఇంటి నుంచి కౌశిక్‌రెడ్డి బయటికి రావాలని సవాల్‌ విసిరారు.

నా ఇంటికి రాలేకపోయావ్‌.. నేనే నీ ఇంటికొచ్చానన్నారు అరికెపూడి గాంధీ. బయటకు రాకుండా ఇంట్లో దాక్కున్నాడని.. కౌశిక్‌రెడ్డికి దమ్మూధైర్యం లేదని.. ఆయనో పిరికివాడని విమర్శించారు అరికెపూడి గాంధీ. అటు.. హైటెన్షన్‌ పొలిటికల్‌ ఫైట్‌తో అప్రమత్తమైన పోలీసులు.. గాంధీని, ఆయన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరికెపూడి గాంధీ, ఆయన అనుచరుల తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు కౌశిక్‌రెడ్డి. తన ఇంటికి గాంధీని ఆహ్వానిస్తే.. ఆయుధాలతో ఇంటిపైకి దూసుకొచ్చారని మండిపడ్డారు. అరికెపూడి గాంధీ తన హత్యకు కుట్ర చేస్తున్నారని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. అరికెపూడి గాంధీకి తానేంటో రేపు చూపిస్తానంటూ కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు.

హరీష్ రావు ఫైర్..

కాగా, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం.. అంటూ ఫైర్ అయ్యారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు, వారినే ఉసిగొల్పి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి ఇది. రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. రాళ్లు, గుడ్లు, టమాటాలతో మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మంది మార్బలంతో వెళ్లి దాడి చేయడం హేయమైన చర్య అని.. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. ఇంటి మీదకు వస్తామని ప్రెస్ మీట్ లో ప్రకటించి, అనుచరులతో దాడి చేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమైందంటూ హరీశ్ రావు ఫైర్ అయ్యారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..