బీజేపీ బీసీ ‘CM’ ప్రకటన.. ఫుల్ జోష్‌లో పార్టీ శ్రేణులు.. ప్రణాళికలు సిద్దం..
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనతో ఆ పార్టీలో జోష్ పెరిగింది. ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకొని బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్తున్నాయి. బీసీ ముఖ్యమంత్రి అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి ఆ పార్టీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

సూర్యాపేటలో అమిత్ షా బీసీ సీఎం ప్రకటనతో బీజేపీ ఓబీసీ మోర్చా సంబరాలు జరుపుకుంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపింది. కాంగ్రెస్, బీఆరెస్ కు బీసీలు ఎందుకు ఓటెయ్యాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు లక్ష్మణ్ ప్రశ్నించారు. బీసీనీ ముఖ్యమంత్రిని చేసే బీజేపీ ఓటెయ్యాలని పిలుపునిచ్చారు.
బీసీల పట్ల బీఆర్ ఎస్ కు చులకనభావం ఉందని ఆరోపించారు ఈటెల రాజేందర్. 40కి పైగా సీట్లు బీసీలకు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించిందన్నారు. సూర్యాపేట బీసీ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. బీసీలకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మరోవైపు కిషన్ రెడ్డి ఇంట్లో బీజేపీ నేతల కీలక సమావేశం జరిగింది. ప్రకాశ్ జవడేకర్, బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. నగరంలోని సీట్లపై నేతలు చర్చించినట్టు తెలిసింది.
ఇదిలా వుండగా హుజూరాబాద్ కు చెందిన ఈటెల రాజేందర్ దళిత బాధిత సంఘం గజ్వేల్ లో ఆయనకు వ్యతరేకంగా ప్రచారం చేస్తామని ప్రకటించింది. ఈటెల రాజేందర్ అక్రమాలపై 50 వేల కరపత్రాలను విడుదల చేసింది.