Bandi Sanjay: హైదరాబాద్ డ్రగ్స్ దందాపై కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్..!

Bandi Sanjay: హైదరాబాద్‌ డ్రగ్స్‌ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో పెద్దపెద్ద సెలబ్రిటీలు, ప్రముఖులు, ఉన్నతాధికారుల పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఈ డ్రగ్స్‌ కేసుపై భారతీయ..

Bandi Sanjay: హైదరాబాద్ డ్రగ్స్ దందాపై కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్..!
Bandi Sanjay
Follow us
Subhash Goud

|

Updated on: Apr 03, 2022 | 10:49 PM

Bandi Sanjay: హైదరాబాద్‌ డ్రగ్స్‌ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో పెద్దపెద్ద సెలబ్రిటీలు, ప్రముఖులు, ఉన్నతాధికారుల పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఈ డ్రగ్స్‌ కేసుపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సగం డ్రగ్స్ (Drugs) దందా టీఆర్ఎస్ (TRS) నాయకులదేనని, వాళ్ల పేర్లు చెబితే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వాళ్లను పట్టుకునే దమ్ముందా? అని సవాల్ విసిరారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రైమ్ మినిస్టర్ 2022 క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని హాజరైన బండి సంజయ్ ఆదివారం జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు. నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించిన 403 క్రికెట్ టీమ్స్ ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. గత ఏడేళ్లుగా తెలంగాణలో డ్రగ్స్ దందా నియంత్రణకు ముఖ్యమంత్రి ప్రభుత్వానికి చేత కావడం లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ సిటీ లో డ్రగ్స్ దందా కొనసాగిస్తున్న వారిలో సగం మంది టీఆర్ఎస్ నాయకులకు సంబంధించినవే అని, వారి పేర్లను చెబితే వాళ్లను పట్టుకుని జైళ్లకు పంపుతారా? అని సంజయ్‌ కేసీఆర్‌కు సవాల్ విసిరారు.

హైదరాబాద్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం ఎందుకు రేగుతోంది అని ప్రశ్నించారు. డ్రగ్స్ బయటపడిన సందర్భాల్లో కఠినమైన చర్యలు తీసుకుంటాం ఉక్కుపాదం మోపుతామని కేసీఆర్‌ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. ఎంతోమంది ఉద్యమకారులు శ్రీకాంత్ చారి, సుమన్ లాంటివాళ్ళు మరెందరో ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందని, అలాంటి తెలంగాణలో మద్యం డ్రగ్స్ తదితర మత్తుపదార్థాల రాష్ట్రంగా కేసీఆర్ మార్చారని విమర్శించారు. దేశంలోనే మద్యం జూదం ఆడే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో మద్యం, డ్రగ్స్ దందా మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకులవని విమర్శించారు. డబల్ బెడ్ రూమ్, వరి ధాన్యం ఇతర సమస్యల విషయంలో ప్రశ్నిస్తే కేసులు జైళ్లు అంటున్నారని తనకు జైళ్లు కొత్త కాదని, ఐదు సంవత్సరాల్లో ఏడు సార్లు జైలుకు వెళ్లిన అనుభవం ఉందని, దేశం కోసం ధర్మం కోసం న్యాయం కోసం ఎన్నిసార్లైనా జైలుకు వెళ్లడానికి, ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

ప్రధాన మంత్రి మోడీ అయ్యాక దేశవ్యాప్తంగా విద్య ఉద్యోగ రైతు తదితర వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. త్వరలోనే గోల్కొండాపై బీజేపీ జెండా ఎగర వేస్తామని, పాతబస్తీలో దుమ్ములేపుతామని అన్నారు. అలాగే ప్రతి యువకుడు కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడాలని కోరారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏప్రిల్ 14న ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టబోతున్నట్టు బండి సంజయ్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

Hyderabad: డ్రగ్స్‌ కేసులో నా కొడుకుకు సంబంధం లేదు.. వేధించవద్దు: శారద

Rahul Sipligunj: రాత్రి పబ్‌లో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పిన రాహుల్ సిప్లిగంజ్