సొరంగాల గోల్కొండ ఖిలాలో మరో ‘రాజ కోట’..!

నిజంగానే గోల్కొండ కోటలో మరో రాజ మహల్ ఉందా..? ప్రస్తుతం గోల్కొండ కోటలో విపరీతంగా.. తవ్వకాలు జరుగుతోన్నాయి. ఇప్పుడు ఇదే న్యూస్ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్నే సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయాలని.. అటు పురావస్తు శాఖ అధికారులు కూడా నడుం బిగించారు. ఇక్కడున్న 40 ఎకరాల్లో ఎక్కడ తవ్వినా పురాతన శిథిలాలే కనిపిస్తున్నాయి. అప్పట్లో.. దీని గురించి కొన్ని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. గోల్కొండ కోట నుంచి చార్మినార్ వరకూ.. అతి పెద్ద సొరంగం […]

సొరంగాల గోల్కొండ ఖిలాలో మరో 'రాజ కోట'..!
Follow us

| Edited By:

Updated on: Dec 15, 2019 | 6:16 PM

నిజంగానే గోల్కొండ కోటలో మరో రాజ మహల్ ఉందా..? ప్రస్తుతం గోల్కొండ కోటలో విపరీతంగా.. తవ్వకాలు జరుగుతోన్నాయి. ఇప్పుడు ఇదే న్యూస్ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్నే సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయాలని.. అటు పురావస్తు శాఖ అధికారులు కూడా నడుం బిగించారు. ఇక్కడున్న 40 ఎకరాల్లో ఎక్కడ తవ్వినా పురాతన శిథిలాలే కనిపిస్తున్నాయి. అప్పట్లో.. దీని గురించి కొన్ని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. గోల్కొండ కోట నుంచి చార్మినార్ వరకూ.. అతి పెద్ద సొరంగం ఉందని.. ఇక్కడ బంగారు ఆభరణాలు, డబ్బు దాచేవారని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.

గోల్కొండ పక్కనే ఉన్న 212 ఎకరాలను.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అప్పటి ప్రభుత్వం.. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌కు అప్పగించింది. అంతేకాకుండా.. నయాఖిలా ఉన్న 40 ఎకరాల్లో తనిఖీలు చేసే బాధ్యతను.. ఏఎస్‌ఐకి అప్పగించింది గోల్ఫ్ క్లబ్. అక్కడేమైనా తవ్వకాల్లో బయటపడితే.. వాటిని ఎట్టి పరిస్థితుల్లో సంబంధీకులకు ఇవ్వకూడదని నిర్ణయించింది. ఇది వరకే ఈ ప్రాంతంలో.. తవ్వకాలు జరిపి నిలిపివేశారు. ఇప్పుడు… మళ్లీ కూలీలతో తవ్వకాలు నిర్వహిస్తున్నారు. తవ్వకాలు జరిపిన ప్రతీ ప్రదేశంలో.. ఇలాంటి ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. బెంగుళూరు నుంచి వచ్చిన ప్రత్యేక పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) నిపుణుల బృందం పర్యవేక్షణలో తవ్వకాలు నిర్వహించాలని హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ నిర్ణయించినట్టు సమాచారం.

అయితే.. ప్రశాంతత కోసం రాజకుటుంబీకులు ప్రత్యేకంగా ఈ రాజమహల్‌ని (1629)లో నిర్మించినట్టు ఏఎస్‌ఐ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో లోతుగా తనిఖీలు నిర్వహిస్తే కానీ.. ఏ విషయం అనేది బయటపడదని.. చరిత్రకారులతో పాటు తనిఖీల బృందాలు భావిస్తున్నాయి.