పసుపు బోర్డ్‌తో లాభం లేదట.. మాట మార్చిన బీజేపీ ఎంపీ!

నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతుల కోసం బోర్డును ఏర్పాటు చేయడం కంటే శాశ్వత పరిష్కారం కోసమే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఎంపీ అరవింద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన రీసెంట్‌గా మీడియా సమావేశంలో మాట్లాడుతూ బోర్డుల ద్వారా రైతులకు న్యాయం జరగదని.. త్వరలోనే కొన్ని బోర్డులు రద్దు కానున్నాయని స్పష్టం చేశారు. పసుపు బోర్డు అనేది పాత విషయమని.. దాని ద్వారా రైతులకు లాభం ఉండదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పసుపు పంటకు గిట్టుబాటు […]

పసుపు బోర్డ్‌తో లాభం లేదట.. మాట మార్చిన బీజేపీ ఎంపీ!
Follow us

|

Updated on: Dec 15, 2019 | 8:55 PM

నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతుల కోసం బోర్డును ఏర్పాటు చేయడం కంటే శాశ్వత పరిష్కారం కోసమే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఎంపీ అరవింద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన రీసెంట్‌గా మీడియా సమావేశంలో మాట్లాడుతూ బోర్డుల ద్వారా రైతులకు న్యాయం జరగదని.. త్వరలోనే కొన్ని బోర్డులు రద్దు కానున్నాయని స్పష్టం చేశారు. పసుపు బోర్డు అనేది పాత విషయమని.. దాని ద్వారా రైతులకు లాభం ఉండదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించి కేంద్రానికి ప్రపోజల్ పంపించాలని ఆయన సూచించారు.

అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పసుపు టైస్, క్లస్టర్ ఏర్పాటు చేయడానికి కసరత్తులు చేస్తున్నారని.. ఇక దానితో బోర్డ్ కంటే మెరుగైన లాభాలు రైతులకు వస్తాయని అరవింద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టైస్, క్లస్టర్ వంటి నూతన స్కీంలు అమలులోకి వస్తే పసుపు రైతుల భవిష్యత్తు బాగుంటుందని ఆయన అన్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల ముందు తాను గెలిస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న అరవింద్.. ఇప్పుడు మాట మార్చారంటూ రైతులు ఆరోపిస్తున్నారు.