Hyderabad: తెలంగాణ EAPCET పరీక్షలకు సర్వం సిద్దం.. ఒక్క నిమిషం లేట్ అయినా..
తెలంగాణ EAPCET పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు జరిగే ఎప్ సెట్ పరీక్షల కోసం జేఎన్టీయూ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి తెలిపారు.

తెలంగాణ EAPCET పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు జరిగే ఎప్ సెట్ పరీక్షల కోసం జేఎన్టీయూ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా EAPCET పరీక్ష నిర్వహణ కోసం 16 నగరాల్లో 124 ఎగ్జామ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈనెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మా విభాగాలకు చెందిన పరీక్ష జరగనుంది. మే 2 నుంచి 4వ తేదీ వరకు ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
ప్రతిరోజు రెండు సెషన్లలో ఎగ్జామ్స్‌ను నిర్వహించనుండగా.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. ఒక్క నిమిషం పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన పరీక్షకు అనుమతించేది లేదంటూ అధికారులు స్పష్టం చేశారు.
ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉండడంతో విద్యార్థులంతా సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి, EAPCET కన్వీనర్ డిన్ కుమార్ సూచించారు. ఇక ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు సంబంధించి 2, 19, 420 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా… అగ్రికల్చర్ ఫార్మా కు సంబంధించిన ప్రవేశ పరీక్ష కోసం 86, 101 మంది అప్లై చేశారు. ఈ రెండింటి కి కలిపి అప్లై చేసుకున్న వారు 253 మంది విద్యార్థులు ఉన్నారు.
