Hyderabad: ఉలిక్కి పడుతున్న హైదరాబాద్.. మరోసారి తెరమీదకు ‘ఉగ్ర’చర్చ..

| Edited By: Janardhan Veluru

Jul 13, 2023 | 1:59 PM

Hyderabad News: దేశంలో ఎక్కడ ఉగ్రవాద జాడలు కనిపించినా టక్కున వినిపించే పేరు హైదరాబాద్.. గతంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా హైదరాబాదులో దాని మూలాలు బయటపడేవి.. కానీ తెలంగాణ వచ్చాక అలాంటి అపవాదిని హైదరాబాద్ తుడిచి వేసుకుంది.. కానీ గడిచిన 2 సంవత్సరాలుగా..

Hyderabad: ఉలిక్కి పడుతున్న హైదరాబాద్.. మరోసారి తెరమీదకు ‘ఉగ్ర’చర్చ..
Scene of the Hyderabad blasts (Inset)
Follow us on

Hyderabad News: దేశంలో ఎక్కడ ఉగ్రవాద జాడలు కనిపించినా టక్కున వినిపించే పేరు హైదరాబాద్.. గతంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా హైదరాబాదులో దాని మూలాలు బయటపడేవి.. కానీ తెలంగాణ వచ్చాక అలాంటి అపవాదిని హైదరాబాద్ తుడిచి వేసుకుంది.. కానీ గడిచిన 2 సంవత్సరాలుగా హైదరాబాద్ పేరు మరొకసారి టెర్రర్ హబ్‌గా వినిపిస్తోంది. అవును, గడిచిన రెండు సంవత్సరాలుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఎస్పెషల్లీ హైదరాబాద్‌పైన ఫోకస్ చేయడం తీవ్ర కలకలం రేపుతుంది.. బతుకు తెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన చాలామంది ఇతర రాష్ట్రాల టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్‌కు చెందిన సింఫతీసర్స్‌కు హైదరాబాద్ అడ్డాగా మారిందని అపవాదు మరోసారి వస్తోంది.. రెండు నెలల్లో దాదాపు మధ్యప్రదేశ్ గుజరాత్ చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు హైదరాబాద్‌లో రైడ్ చేసి కొంతమంది హట్‌కి చెందిన టెర్రరిస్టును అరెస్ట్ చేసి తీసుకెళ్లారు… వీళ్లు పేలుళ్ళే లక్ష్యంగా మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించి ఇతర మతాల కు సంబంధించిన బోధనలు చేస్తూ పేలుళ్లకు పాల్పడాలన్న అనుమానంతో వీరందరినీ అరెస్ట్ చేశారు

జంట పేలుళ్లకు అడ్డాగా హైదరాబాద్..!

గతంలో లుంబినీ, గోకుల్ చాట్ జంట పేలుళ్ల పాటు దిల్షుక్నగర్‌లో జరిగిన ట్విన్ బ్లాస్ట్‌లు హైదరాబాదులో వందలాది అమాయకుల ప్రాణాలను బలికున్నాయి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ,ఆ తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట హైదరాబాద్లో ఉన్న ఇన్ఫార్మర్ల వ్యవస్థతో పాటుగా ఇక్కడున్న టెర్రర్ నెట్వర్క్‌ని పూర్తిగా తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ తుడసివేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు సోషల్ మీడియా వేదిక ఐసిస్‌ కారణంగా ప్రభావితం అవుతున్నటువంటి కొంతమంది యువకులను గుర్తించి అరెస్ట్ కూడా చేసింది. ఐసిస్‌లోకి వెళ్లకుండా ముంబై వరకు వెళ్లి ఎయిర్పోర్ట్ దగ్గరే చాలామందిని ఆపిన సందర్భాలు కూడా చూశాం. కానీ తాజాగా మరొకసారి హైదరాబాద్ ఉగ్రవాదుల షెల్టర్ జోన్‌గా మారిందన్న బలమైన వాదన వినిపిస్తోంది.

రోజుకో రైడ్ పూటకో అరెస్ట్

ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు డైరెక్ట్ గా ఇక్కడ దాడులు నిర్వహించడం తీవ్ర కలకలం రేపింది.. తాజాగా ఇండియన్ ముజాహిద్‌కి చెందిన ఒబెర్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడడంతో మరొకసారి హైదరాబాద్ పేరు ప్రముఖంగా వినిపించింది.. హైదరాబాద్‌తో పాటు మెట్రో నగరాలైన బెంగళూర్ కోల్కత్త అస్సాం తో పాటు అనేక రాష్ట్రాల్లో ఢిల్లీ ముంబై కేంద్రంగా బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారన్న అభియోగాల కింద కోర్ట్ శిక్ష విధించింది.. దీంతో హైదరాబాద్ పేరు మరొకసారి ప్రముఖంగా వినిపించింది. ఈ నేపథ్యంలో టెక్నాలజీ‌తో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ని నమ్ముకొని హైదరాబాదులో ఉన్న రాడికల్ వ్యవస్థని హైదరాబాద్లో ఉన్న ఇన్ఫార్మర్ల వ్యవస్థని హైదరాబాద్లో ఉన్న టెర్రర్ మూలాలని ఇప్పటికైనా తెలంగాణ పోలీసులు పసిగట్టి హైదరాబాద్ పేరును కాపాడుతారని ఆశిద్దాం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..