Hyderabad: పోయే కాలం దాపురిస్తేనే ఇలా చేస్తారు.. యువకుడిని చంపి కత్తులతో వీరంగం.. ఇన్‌స్టాలో లైవ్..
ఏం పోయేకాలం దాపురించిందో ఏమో కానీ.. కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తోటివారిని చంపుతూ రాక్షసానందాన్ని పొందుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి ప్రగతినగర్‌లో దారుణం చోటుచేసుకుంది.. ఓ యువకుడ్ని దారుణంగా హత్య చేశారు దుండగలు.. హత్యానంతరం నిందితులు ఇన్‌స్టాలో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు..

ఏం పోయేకాలం దాపురించిందో ఏమో కానీ.. కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తోటివారిని చంపుతూ రాక్షసానందాన్ని పొందుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి ప్రగతినగర్‌లో దారుణం చోటుచేసుకుంది.. ఓ యువకుడ్ని దారుణంగా హత్య చేశారు దుండగలు.. హత్యానంతరం నిందితులు ఇన్‌స్టాలో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు.. అర్థరాత్రి బైక్‌పై తిరుగుతూ రక్తం అంటిన కత్తులతో రోడ్డుపై హల్‌చల్ చేశారు.. ఈ హత్యకు పాతకక్షలే కారణమని భావిస్తున్నారు పోలీసులు.. మృతుడు తేజస్‌గా గుర్తించారు..
ప్రగతినగర్‌లోని బతుకమ్మకుంట దగ్గర తన తల్లితో నివాసం ఉంటున్నాడు తేజస్ (సిద్ధు).. జూలాయిగా తిరుగుతూ పలు నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. రెండు నెలల క్రితమే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.. అయితే నిన్న రాత్రి పన్నెండున్నరకు కొందరు దుండగులు వచ్చి ఇంట్లో ఉన్న తేజస్‌ను బయటికి తీసుకెళ్లి అత్యంత దారుణంగా చంపేశారు. అతడి తలపై బండరాయితో మోది ఆపై కత్తులతో పొడిచి హత్య చేశారు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తేజస్ శరీరంపై 12 కత్తిపోట్లు గుర్తించారు పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టా వీడియో ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు..
ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




