AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నువ్వే I Love You చెప్పావ్’.. ప్రొఫెసర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్ధిని..! వీడియో వైరల్‌

బెంగళూరులోని ఓ మెడికల్ కాలేజీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో ఓ ప్రొఫెసర్ విద్యార్థినికి ప్రేమ ప్రతిపాదన చేసినట్లు ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో విద్యార్థిని ప్రొఫెసర్‌ను చెప్పుతో కొట్టినట్లు వైరల్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే?

‘నువ్వే I Love You చెప్పావ్’.. ప్రొఫెసర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్ధిని..! వీడియో వైరల్‌
Professor Allegedly Proposes To Student In Classroom
Srilakshmi C
|

Updated on: Oct 26, 2026 | 4:14 PM

Share

బెంగళూరు, అక్టోబర్ 26: కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తరగతి గదిలోనే ఓ ప్రొఫెసర్ విద్యార్థినికి ప్రేమ ప్రతిపాదన చేసినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. అంతేకాకుండా, ఈ సందర్భంగా విద్యార్థులకు చాక్లెట్లు కూడా పంచినట్లు సమాచారం. అయితే, ఈ వ్యవహారాన్ని సదరు విద్యార్థిని తీవ్రంగా వ్యతిరేకించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

అసలు ఏం జరిగిందంటే..?

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. బెంగళూరులోని శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మహమ్మద్ అనే ప్రొఫెసర్ తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడుతూ.. ఓ విద్యార్థిని తనకు ప్రేమను వ్యక్తం చేసిందని, తాను కూడా ఆమె ప్రేమను అంగీకరించినట్లు చెప్పినట్లు వైరల్ వీడియోల్లో కనిపిస్తోంది. ఈ సందర్భంగా విద్యార్థులకు చాక్లెట్లు పంచినట్లు సమాచారం. అయితే ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలపై సదరు విద్యార్థిని వెంటనే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. అయినప్పటికీ ఆ ప్రొఫెసర్ ఆమె తనపై ప్రేమను వ్యక్తం చేసిందని పట్టుబట్టినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇందుకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఉందని చెప్పడంతో.. ఆ వీడియోను చూపించాలని విద్యార్థిని డిమాండ్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో ప్రొఫెసర్ అక్కడి నుంచి బయటకు వెళ్తూ.. మరుసటి రోజు ఆమెతో మాట్లాడతానని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విద్యార్థిని ఆయనను ఎదుర్కొని చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వైరల్ వీడియోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఆ తర్వాత ఇతర విద్యార్థులు కూడా అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తూ, ప్రొఫెసర్‌పై దాడి చేశారు. ఈ ఘటన నెలమంగళ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నప్పటికీ, ఇప్పటివరకు విద్యార్థిని, లేదా ప్రొఫెసర్‌ నుంచి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. తరగతి గదిలో విద్యాబోధన జరగాల్సిన చోట ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే వైరల్ వీడియోల ఆధారంగా మాత్రమే పూర్తి వాస్తవాలను నిర్ధారించలేం. ఈ వ్యవహారంపై అధికారిక విచారణ జరిగితేనే అసలు విషయం స్పష్టమవుతుంది.

Follow Us