AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆధార్, పాన్ ధృవీకరణకు ప్రభుత్వం డెడ్ లైన్.. డిసెంబర్ 31 వరకే ఛాన్స్..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, పెన్షనర్ల పాన్, ఆధార్ ధృవీకరణకు డెడ్ లైన్ విధించింది. డిసెంబర్ 31లోగా పాన్, ఆధార్ ధృవీకరణ పూర్తి చేయాలని గడువు విధించింది. ఈ మేరకు అని శాఖల అధిపతులకు ఆదేశాలు జారీ చేసింది.

Telangana: ఆధార్, పాన్ ధృవీకరణకు ప్రభుత్వం డెడ్ లైన్.. డిసెంబర్ 31 వరకే ఛాన్స్..
Aadhaar And Pan
Venkatrao Lella
|

Updated on: Oct 26, 2026 | 1:58 PM

Share

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వారి పాన్, ఆధార్ కార్డ్ ధృవీకరణను పూర్తి చేయాలని అన్ని శాఖల హెచ్‌ఓడీలకు సూచించింది. ఉద్యోగులు, పెన్షనర్ల ఆధార్, పాన్ కార్డు వివరాలను సేకరించి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ సిస్టమ్ పెన్షన్ మాడ్యుల్‌లో అప్డేట్ చేయాలని ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియను కంప్లీట్ చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఈ మేరకు పాన్ ఆధార్ కాపీలను సేకరించాలని ట్రెజరీ, అకౌంట్ శాఖ అధికారులకు సూచనలు చేసింది.పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించడంలో జాప్యం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్న క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తమ బకాయిలు చెల్లించడం లేదని, పెన్షన్ చెల్లింపులో ఆలస్యం చేస్తున్నారని పెన్షనర్లు ఇటీవల ఆందోళనలు కూడా చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వం జాప్యం జరగకుండా చూసేందుకు రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అకౌంట్స్, ట్రెజరీ శాఖ అధికారులను ఆదేశించింది. ఖచ్చిమైన రికార్డులను అప్డే్ట్ చేస్తే జాప్యం జరగదని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఉద్యోగుల ఆధార్, పాన్ వివరాలను సేకరించాలని కోరింది. పెన్షనర్లను గుర్తించడంతో పాటు అక్రమ పెన్షన్‌దారులను గుర్తించడంలో ఇది సహాయపడుతుందని తెలిపింది. మరణించిన పెన్షనర్ల రికార్డులను పరిశీలించుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలకు సంబంధించి ప్రభుత్వం ఒక మెమో జారీ చేసింది.

ఈ ఏడాది చివరి నాటికి 9719 మంది ఉద్యోగులు రిటైర్ అవుతుండగా.. వచ్చే ఏడాది 9443 మంది పదవీ విరమణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆధార్, పాన్ ధృవీకరణ ప్రక్రియ ఈ ఏడాడి డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రాధాన్యత క్రమంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. సర్వీస్ రికార్డులు, సహాయక పత్రాలతో వివరాలను సరిపోల్చి చూసుకోవాలని తెలిపింది. వివరాల్లో తప్పులు ఉంటే సరిద్దాలని పేర్కొంది.

Follow Us