Aadhaar Hacking: అర్ధరాత్రి ఆధార్ హ్యాకింగ్.. ఆందోళనలో ఆధార్ సెంటర్స్ ఆపరేటర్లు! సైబర్ నేరగాళ్ల పనేనా..?

ఆధార్ కేంద్ర ఆపరేటర్లకు లాగిన్ మెయిల్స్ చుక్కలు చూపిస్తున్నాయి. అర్ధరాత్రి దాటాక బయోమెట్రిక్ లాగిన్ చేసినట్లు వరుస మెసేజ్ లు వస్తుండటంతో Aadhaar operators in Telangana report midnight login alerts: బెంబేలెత్తి పోతున్నారు. సాంకేతిక సమస్యతో మెసేజ్ లు వస్తున్నాయా..? ఇంకేమైనా కారణముందా? అని ఆపరేటర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మా ఐడితో వేరే వాళ్ళు ఆధార్ కార్డులలో మార్పులు చేస్తున్నారేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్న ఆధార్ సెంటర్ ల ఆపరేటర్లు. ఈ క్రమంలో తమ ఐడిలను ఉగ్రవాదులు ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు..

Aadhaar Hacking: అర్ధరాత్రి ఆధార్ హ్యాకింగ్.. ఆందోళనలో ఆధార్ సెంటర్స్ ఆపరేటర్లు! సైబర్ నేరగాళ్ల పనేనా..?
Aadhaar center operators in Aadhaar hacking concern

Edited By:

Updated on: Nov 13, 2025 | 5:05 PM

ఆధార్ కేంద్రాల ఆపరేటర్ల లాగిన్ ను అర్ధ రాత్రి దాటాక ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ-మెయిల్ మెసేజ్‌లు వస్తున్నాయి. తమ వ్యక్తిగత బయోమెట్రిక్ వివరాలతో గుర్తుతెలియని వ్యక్తులు పదుల సార్లు లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తూ విఫలమవుతున్నారని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరివి విజయవంతంగా లాగిన్ చేసినట్లు కూడా ఈ-మెయిల్స్ వస్తున్నాయని అంటున్నారు. దీంతో వారిని హ్యాకింగ్ భయం వెంటాడుతోంది. ఇలాంటి ఘటనలు నిజామాబాద్, హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా చోటుచేసుకుంటున్నాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకు 20 నుంచి 100 కు పైగా ఈ-మెయిల్ సందేశాలు వస్తున్నాయి. ఆధార్ కేంద్రాల నిర్వాహకులు లాగిన్ చేసినప్పుడు కొన్ని సార్లు సందేశాలు ఆలస్యంగా వస్తాయి. అవి కూడా ఒక్కసారే వస్తాయి. కానీ ఇప్పుడు అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు పదే పదే వస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకు ఎకౌంట్లతో పాటు దాదాపుగా అన్నింటికీ ఆధార్ లింక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేటర్ల లాగిన్ లకే మెసేజ్‌లు రావడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.

మా ఐడి తో వేరే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ చెందిన వారికి ఆధార్ కార్డులు జారీ చేస్తే మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఉగ్రవాదులు కూడా మా ఐడి లతో ఆధార్ కార్డులు పొందే అవకాశం ఉన్నది. అలా ఉగ్రవాదులు ఫేక్ ఐడి తో ఆధార్ లు పొందితే మేము కేసుల పరంగా కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెయిల్స్ సాంకేతిక సమస్య కారణంగా వస్తున్నాయా లేక ఇంకేమైనా కారణముందా అని ఆపరేటర్ లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెందుతున్నారు. యూఐడీఏఐ అధికారులు చొరవ తీసుకుని దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. హైదరాబాద్ లోని ముఖేశ్ అనే ఆపరేటర్ లాగిన్ ను 6 రోజుల వ్యవధిలో 200 సార్లు ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసినట్లు మెసేజ్ లు వచ్చాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ఆపరేటర్ శ్రీకాంత్ కు నెల నుంచి ప్రతి రోజు సుమారు 30 వరకు మెసేజ్ లు వస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలానికి చెందిన సిద్దు కు ఒక్క రాత్రి లోనే దాదాపు 31 మెసేజ్ లు వచ్చాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల ఆపరేటర్ జాగం శ్రీనివాసు 15 రోజులుగా మెసేజ్ లు వచ్చాయి.

యుఐడిఏఐ అధికారులకు ఆధార్ సెంటర్ ఆపరేటర్లు ఇప్పటికి చాలాసార్లు ఫిర్యాదులు చేసినా గాని ఎలాంటి రెస్పాన్స్ లేదు. మీసేవ కమిషనర్ కూడా యుఐడిఏఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా కానీ ఇంత వరకు కూడా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఇకనైనా మా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆధార్ సెంటర్ ఆపరేటర్లు వేడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.