
హైదరాబాద్, జూన్ 18: హైదరాబాద్ పాతబస్తీ ఐస్ సదన్ చౌరస్తాలోని కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎంలో చోరీకి ఓ దుండగుడు విఫలయత్నం చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎం మెషిన్ ధ్వంసం చేస్తుండగా ప్రైవేట్ సెక్యూరిటీ గుర్తించారు. అర్ధరాత్రి ప్రైవేట్ సెక్యూరిటీ అన్ని ఏటీఎంలను చెక్ చేస్తున్న సమయంలో కోటాక్ మహీంద్రా ఏటీఎంలో దుండగుడుని గుర్తుంచి వెంటనే ఐస్ సదన్ పోలీసులకు సమాచారం అందించాడు. ప్రైవేట్ సెక్యూరిటీని చూసిన వెంటనే దుండగుడు సంఘటన స్థలం నుండి పారిపోయాడు. సైదాబాద్ ఐస్ సదన్ ప్రధాన రహదారిపై ఘటన బుధవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక అంచనా.
వెంటనే ఐస్ సదన్ పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. దీంతో దీంతో పెద్ద దోపిడీ తప్పింది. సంఘటన స్థలానికి చేరుకున్న సౌత్ ఈస్ట్ జోన్ నైట్ డ్యూటీ ఆఫీసర్ సైదాబాద్ ఏసీపీ వెంకట్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. అలాగే ఏటీఎంలో అమర్చిన సిసి కామెరాలను సైతం పరిశీలిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కాగా సులువుగా డబ్బు సంపాదించడానికి దుండగులు ఏటీఎం లూటీకి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నగరంలో పలుమార్లు ఏటీఎంలలో చోరీకి గురైనాయి. గ్యాస్ కట్టర్ లతో బ్రేక్ చేసి ఎన్నో సార్లు దొంగలు ఏటీఎంలోని నగదును దొంగిలించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా పాతబస్తీలో జరిగిన ఘటనలో దుండగుడు ఏటీఎంను ఇటుక రాళ్లతో పగలగొట్టడానికి ప్రయత్నించాడు. ప్రైవేట్ సెక్యురిటీ అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. ఏటీఎం గదిలో ఇటుక రాళ్లు చెల్లాచెదురుగా పడిన ఉన్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.