Hyderabad: భాగ్యనగరంలో మరో యాక్సిడెంట్.. నుజ్జు నుజ్జయిన కార్లు.. పూర్తి వివరాలివే..

Hyderabad Accident: వరుస రోడ్డు ప్రమాదాలు వాహనదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత 3 రోజుల నుంచి తెల్లవారు జామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మలక్పేట్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే మార్గంలో మరొక రోడ్డు..

Hyderabad: భాగ్యనగరంలో మరో యాక్సిడెంట్.. నుజ్జు నుజ్జయిన కార్లు.. పూర్తి వివరాలివే..
Malakpet Car Accident

Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 09, 2023 | 7:02 AM

Hyderabad Accident: వరుస రోడ్డు ప్రమాదాలు వాహనదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత 3 రోజుల నుంచి తెల్లవారు జామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మలక్పేట్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే మార్గంలో మరొక రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా వచ్చిన కారు.. మరొక కారును బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇరు కార్ల ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.

అయితే విషయం తెలుసుకున్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని గాయపడినవారిని హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారు జామున జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలకు నిద్ర మత్తులో లేదా మద్యం సేవించి వాహనాలని నడపడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా మారుతుందని పోలీసులు చెబుతున్నారు. 3 రోజుల వ్యవధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో జూబ్లీహిల్స్‌లో 2, మలక్పేట్‌లో ఒకటి ఉన్నాయి. ఈ మేరకు రాత్రుళ్ళే ఏ కాదు తెల్లవారు జామున ప్రయాణించే వాహనాదారులు సైతం మరింత అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. లేదా రెప్పపాటులో జరగకూడని ఘోరం జరుగుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

-పెద్దప్రోలు జ్యోతి, టీవీ9 రిపోర్టర్, హైదరాబాద్

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..