KTR on PM Modi: ‘మోదీ పర్యటన మెత్తం ఆత్మవంచన, పరనింద’.. ప్రధాని ప్రసంగంపై మంత్రి కేటీఆర్ ఫైర్..

Minister KTR on PM Modi: ప్రధాని మోదీ తన వరంగల్‌ పర్యనలో భాగంగా శనివారం బీజేపీ విజయ సంవల్ప సభలో చేసిన ప్రసంగంపై బీఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ పర్యటన మెత్తం ఆత్మవంచన, పరనింద..

KTR on PM Modi: ‘మోదీ పర్యటన మెత్తం ఆత్మవంచన, పరనింద’.. ప్రధాని ప్రసంగంపై మంత్రి కేటీఆర్ ఫైర్..
KTR on PM Modi
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 08, 2023 | 4:59 PM

Minister KTR on PM Modi: ప్రధాని మోదీ తన వరంగల్‌ పర్యనలో భాగంగా శనివారం బీజేపీ విజయ సంవల్ప సభలో చేసిన ప్రసంగంపై బీఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ పర్యటన మెత్తం ఆత్మవంచన, పరనింద అన్న తీరుగా కొనసాగిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే తారకరామారావు అన్నారు. మోదీ ప్రస్తావించిన అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రసంగం మొత్తం అసత్యాలతో కొనసాగిందన్నారు. తెలంగాణకి వచ్చిన ప్రతిసారీ ప్రధాని మోదీకి కేవలం ఇక్కడి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేల్చడం, అసత్యాలు మాట్లాడడం అలవాటుగా మారిందన్నారు. మోదీ తెలంగాణకి ఏం చేయగలరో చెప్పకుండా, ఉపన్యాసం ఇచ్చి ఉత్త చేతులతో వెళ్లిపోవడం పరిపాటిగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలకు, అభివృద్ధికి కేంద్రం ముఖ్యంగా బీజేపీ చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని అయినా చెబితే బాగుండేదన్నారు. గత తొమ్మిది సంవత్సరాలలో అడుగడుగునా తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, బీజేపీ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని గుర్తుంచుకొని, రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ఆ పార్టీని తెలంగాణ నుంచి ప్రజలు తన్ని తరిమేస్తారని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అనేది 45 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, డిమాండ్. కానీ  స్థానంలో రైల్వే రిపేర్ షాప్ పేరుతో ప్రధాని తెలంగాణ ప్రాంతానికి ఏదో గొప్ప మేలు చేసినట్లు చెప్పడం ఇక్కడి ప్రజలను అవమానించడమేనని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజలు అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పట్టించుకోకుండా తన సొంత రాష్ట్రానికి 20000 కోట్ల రూపాయల లోకోమోటివ్ ఫ్యాక్టరీని మోసపూరితంగా తరలించుకుపోయిన ప్రధాని మోదీ ‘సబ్ కా సాత్ , సబ్ కా వికాస్ అనే నినాదం’.. ‘గుజరాత్ కా సాత్, గుజరాత్ కా వికాస్’గా మారిపోయిందని మండిపడ్డారు. తెలంగాణ గత 9 సంవత్సరాల్లో అడిగిన బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీపీఐ పునఃప్రారంభం, ఇక్కడి జాతీయ రహదారి ప్రాజెక్టుల నుంచి మొదలుకొని, నూతన రైల్వే లైన్లు ఏర్పాటు, రైల్వే లైన్ల బలోపేతం వంటి అన్ని రకాల డిమాండ్లను పక్కన పెట్టిన ప్రధాని రాష్ట్ర ప్రజల పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని, వివక్షను అందరూ గమనిస్తున్నారని, సరైన సమయంలో బీజేపీకి గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు.

దేశానికి గోల్డెన్ పీరియడ్ వచ్చిందని, యువత ఈ బంగారు కాలాన్ని వినియోగించుకోవాలన్న మోదీ అసలు దేశంలోని యువత కోసం గత తొమ్మిది సంవత్సరాలలో చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని అయినా చెప్పి ఉంటే బాగుండేదని కేటీఆర్ అన్నారు. ఓ వైపు దేశంలో ఎన్నడూలేనంతగా నిరుద్యోగం పెంచిన తన అసమర్ధ పాలనపై ప్రశ్నిస్తే.. పకోడీలు వేసుకోవడం కూడా ఉద్యోగమేనంటూ అవహేళన చేసిన మోదీ యువతను ఉద్దేశించి మాట్లాడడం విడ్డూరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల 20 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న విషయాన్ని దాచిపెట్టి, కేంద్ర ప్రభుత్వంలో దాదాపు 16 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను నింపకుండా, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాలను శాశ్వతంగా ప్రైవేటుపరం చేస్తున్న మోదీ నరేంద్ర మోదీ తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పైన మాట్లాడడం గురువింద సామెత కన్నా హీనంగా ఉందన్నారు. తెలంగాణ యువతకు లక్షలాది ఉద్యోగాలను అందించే అవకాశం ఉన్న ఐటిఐఆర్ ప్రాజెక్టును ప్రభుత్వంలోకి రాగానే రద్దు చేసిన మోదీ ఇక్కడి ఉన్నత విద్యావంతులకు చేసిన మోసాన్ని ఎన్నటికీ తెలంగాణ యువత మరిచిపోదన్నారు. తెలంగాణలోని యూనివర్సిటీల ఖాళీల గురించి మాట్లాడిన ప్రధాని, దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల ఖాళీలను ముందుగా భర్తీ చేయాలని సూచించారు. యూనివర్సిటీల ఖాళీల భర్తీ కోసం మా ప్రభుత్వ రూపొందించిన చట్టాన్ని, బిజెపి నాయకురాలు, ప్రస్తుత గవర్నర్ తమిళసై తొక్కిపెట్టిన విషయంలో మోదీ స్పందించి ఉంటే బాగుండేదని సూచించారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ గురించి అసత్యాలు మాట్లాడిన మోదీకి, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క గురుకుల విద్యార్థి పైన 1,25,000 ఖర్చుతో అత్యున్నత ప్రమాణాల విద్య అందిస్తున్న ప్రభుత్వం మాదని గుర్తుంచుకుంటే మంచిదని కేటీఆర్ హితవు పలికారు. ప్రధాని మోదీలా అనర్గళంగా అబద్ధాలు చెప్పాలంటే చాలా ధైర్యం కావాలని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోదీ మాటలు ఏమయ్యాయో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకువచ్చి, 700 రైతుల మరణాలకు కారణమైన మోదీ ఈరోజు వ్యవసాయ రంగం గురించి మాట్లాడడం దుర్మార్గం అన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగం అన్ని సూచీల్లోనూ ముఖ్యంగా, ఆహార ధాన్యాల ఉత్పత్తి నుంచి మొదలుకొని పెరిగిన విస్తీర్ణం, సాగునీటి విప్లవం, రైతు సంక్షేమ పథకాల వరకు ప్రతి అంశంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న విషయం మోదీ తెలుసుకుంటే మంచిది అని హితవు పలికారు.

కార్పొరేట్ మిత్రులకు పన్నెందున్నర లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిన మోదీ దేశంలోని రైతుల రుణాలన్నింటిని మాఫీ చేసే అవకాశం ఉన్నా, ఎందుకు ఇప్పటిదాకా ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజనుల సంక్షేమం గురించి ప్రస్తావించిన మోదీ, తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నప్పటికీ, పార్లమెంట్ సాక్షిగా దక్కిన గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు వ్యవహారాన్ని కేంద్రం తొక్కిపెట్టి వేలాదిమంది గిరిజన, ఆదివాసీ యువకుల ఉన్నత విద్య అవకాశాలను మోదీ ప్రభుత్వం దెబ్బతీసిన విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. మోదీ కుటుంబ పాలన గురించి, అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించిన దానికంటే దారుణంగా ఉందన్నారు. బీజేపీలో అనేక రాష్ట్రాల్లోని నాయకుల కుటుంబ సభ్యులు, స్వయంగా తన క్యాబినెట్ లోని మంత్రుల వరకు వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారే అనే విషయాన్ని మోదీ గుర్తుంచుకుంటే మంచిదన్నారు.

తెలంగాణని ఒక కుటుంబంగా, తెలంగాణ ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి, వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న తెలంగాణ కుటుంబ పార్టీ మాది అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతి కార్యక్రమాల పైన కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ చేపిస్తామంటూ మోదీ అన్న మాటల పైన కేటీఆర్ స్పందించారు. కేంద్రం ఏజెన్సీలకు తాము భయపడే ప్రసక్తే లేదని, ఈ ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులతో కలవరపడే ప్రభుత్వం, నాయకత్వం తమది కాదని కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం మహాయజ్ఞంలా కృషిచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!