రూ.7.56లక్షలు పలికిన భోలక్‌పూర్ బంగారు లడ్డూ
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనాలు ఊపందుకున్నాయి. నిమజ్జనానికి ముందు లడ్డూ, పండ్లు, పూలదండల వేలం వేస్తున్నారు. వీటిని భారీ ధరలతో దక్కించుకుంటున్నారు భక్తులు. ఈ క్రమంలోనే ..నగరంలోని భోలక్‌పూర్ డివిజన్‌లో ఏర్పాటు చేసిన మండపం వద్ద బంగారు లడ్డూ వేలం కోలాహలంగా జరిగింది. శ్రీ సిద్ధివినాయక భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోలక్‌పూర్‌లో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. అసోసియేషన్ నిర్వాహకులు ఇవాళ స్వామివారి ప్రసాదం లడ్డూను వేలం పాట నిర్వహించారు. ప్రసాదం లడ్డూతో పాటు ఆకర్షణ గొల్పేందుకు […]
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనాలు ఊపందుకున్నాయి. నిమజ్జనానికి ముందు లడ్డూ, పండ్లు, పూలదండల వేలం వేస్తున్నారు. వీటిని భారీ ధరలతో దక్కించుకుంటున్నారు భక్తులు. ఈ క్రమంలోనే ..నగరంలోని భోలక్‌పూర్ డివిజన్‌లో ఏర్పాటు చేసిన మండపం వద్ద బంగారు లడ్డూ వేలం కోలాహలంగా జరిగింది. శ్రీ సిద్ధివినాయక భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోలక్‌పూర్‌లో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. అసోసియేషన్ నిర్వాహకులు ఇవాళ స్వామివారి ప్రసాదం లడ్డూను వేలం పాట నిర్వహించారు. ప్రసాదం లడ్డూతో పాటు ఆకర్షణ గొల్పేందుకు బంగారం లడ్డూను వేలంలో ఉంచడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఏడాది రూ.5 లక్షల విలువ చేసే 123గ్రాముల బంగారం లడ్డూను నిర్వాహకులు తయారు చేయించారు. నిమజ్జనానికి ఒక రోజు ముందు వేలంపాట నిర్వహించడంతో భక్తులు పోటాపోటీగా పాల్గొన్నారు. రూ.5001 నుంచి ప్రారంభమైన వేలం పాట రూ.7.56లక్షతో ముగిసింది. స్థానిక చేపల విక్రయ వ్యాపారి బైరు విష్ణుప్రసాద్ ఈ బంగారు లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది ఏర్పాటు చేసిన వేలంపాటలో 120 గ్రాముల బంగారు లడ్డూను స్థానికుడు కె.భాస్కర్ రూ.8.1లక్షలకు సొంతం చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి లడ్డూ తక్కువ ధర కాస్త తక్కువగానే ఉంది.