Hyderabad: 10వ తరగతికే ఇంత పైత్యమా..? జువైనల్ హోమ్‌కు ముగ్గురు మైనర్ బాలురు

టెన్త్ చదువుతున్న ఓ బాలికను మార్ఫింగ్‌ వీడియోలతో వేధించిన కేసులో ముగ్గురు విద్యార్థులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలీ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. ముగ్గురు సహచర విద్యార్థులు.. ఆ బాలికకు చుక్కలు చూపించారు. మానసికంగా హింసించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

Hyderabad: 10వ తరగతికే ఇంత పైత్యమా..? జువైనల్ హోమ్‌కు ముగ్గురు మైనర్ బాలురు
Gachibowli Police Station

Updated on: Mar 16, 2025 | 1:24 PM

వారు చదివేది 10వ తరగతి.. కానీ పైత్యం చాలా ఎక్కువ ఉంది. సహచర విద్యార్థినికి చుక్కలు చూపించారు. ఇప్పుడు జువైనల్ హోంలో ఊచలు లెక్కబెడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ పాఠశాలలో టెన్త్ చదువుతున్న బాలికను అదే  క్లాస్‌కు చెందిన బాలుడు లవ్ చేస్తున్నానంటూ వెంటపడ్డాడు. బాలిక అతడి దూరం పెట్టడంతో.. ఆమె ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. అనంతరం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో మరో సహచర విద్యార్థి వీడియో తీశాడు. కొద్దిరోజుల తర్వాత ఆ వీడియోను చూపించి ఈ విద్యార్థి కూడా బాలికను వేధింపులకు గురి చేశాడు. తనతో కూడా శారీరకంగా కలవాలంటూ బెదిరించాడు. దీంతో ఆ బాలిక అతని సెల్‌ఫోన్‌ తీసుకొని పగలగొట్టింది. ఫోన్‌ విషయమై వారి మధ్య గొడవ జరగడం.. గమనించిన మూడో సహచర విద్యార్థి సైతం ఆ వీడియోను అందరికీ చూపిస్తానని బాలికను బెదిరింపులకు గురి చేశాడు. ఇలా ముగ్గురూ బాలికను వేధించసాగారు.

ఈ విషయాన్ని బాధితురాలి ఫ్రెండ్స్ ఆమె తల్లిదండ్రులకు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బాలిక తల్లిదండ్రులు గచ్చిబౌలి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం ముగ్గురు మైనర్లను అరెస్ట్‌ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.