Hyderabad News: అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ.. అక్రమార్కులు రెచ్చిపోతూనే ఉన్నారు. అలాంటివారికి కస్టమ్స్ అధికారులు దిమ్మ తిరిగేలా షాకిస్తున్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుపడింది. సాధారణంగా ప్రతిరోజు అక్రమంగా తరలిస్తున్న బంగారం,న విదేశీ కరెన్సీ, డ్రగ్స్, పలు రకాల నిషేధిత వస్తువులు పట్టుబడుతుంటాయి. అయితే, స్మగ్లర్లు పలు పద్దతుల్లో ఎవరికీ అనుమానం రాకుండా బంగారం తరలిస్తూ.. పట్టుబడ్డారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సుమారు రెండు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అండ్ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణిలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో పేస్టు రూపంలో ఉన్న ఆరు క్యాప్సుల్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.1.05 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరి శరీర భాగాల్లో కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని తీసుకొస్తుండగా.. వారిని గుర్తించి, అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. 1705.3 గ్రాముల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని వెనుక ఎవరైనా ఉన్నారేమోనన్న కోణంలో ఇద్దరు నిందితులను విచారిస్తున్నామని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..