Hyderabad: గుండె గుండెనీ కదిలిస్తున్న విషాదం.. బిడ్డను చంపుకోలేక 22 అంతస్తుల నుంచి దూకేసిన తల్లి..

|

Jan 17, 2023 | 12:40 PM

కన్నతండ్రే కాలయముడిగా మారాడు. కన్నబిడ్డపై కాలకూట విషంగక్కాడు. రక్తం పంచుకు పుట్టిన పసికూనను హతమార్చాలని కుట్రలు పన్నాడు. అన్నెం పున్నెం ఎరుగని మానసిక వికలాంగుడైన

Hyderabad: గుండె గుండెనీ కదిలిస్తున్న విషాదం.. బిడ్డను చంపుకోలేక 22 అంతస్తుల నుంచి దూకేసిన తల్లి..
Women Died For Son
Follow us on

కన్నతండ్రే కాలయముడిగా మారాడు. కన్నబిడ్డపై కాలకూట విషంగక్కాడు. రక్తం పంచుకు పుట్టిన పసికూనను హతమార్చాలని కుట్రలు పన్నాడు. అన్నెం పున్నెం ఎరుగని మానసిక వికలాంగుడైన పసివాడిని వదిలించుకొమ్మంటూ ఆ తల్లిని అష్టకష్టాలు పెట్టాడు. కాళ్ళావేళ్ళా పడ్డా కనికరించని భర్త వేధింపులకు విసిగి వేసారింది ఆ తల్లి. పేగుతెంచుకు పుట్టిన బిడ్డకోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన ఆ తల్లి దయనీయగాధ మనసుల్ని కలచివేస్తోంది. 22 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఆ తల్లి మరణం గుండె గుండెనీ కదిలిస్తోంది. ప్రతి వారినీ కన్నీరు పెట్టిస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది.

వివరాల్లోకెళితే..

కాకినాడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శ్రీధర్‌ అనే ఓ వ్యక్తి మనిషి ఎదిగాడు కానీ బుద్ధి ఎదగలేదు. నేమాని శ్రీధర్‌కీ, సర్పవరంకి చెందిన స్వాతికీ 2013లో పెళ్ళయ్యింది. 2016లో పండంటి బిడ్డ పుట్టాడు. అయితే పసివాడికి మానసిక వైకల్యం అని తెలియడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. కన్నవారింట్లోనే కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. లోకం తెలియని పసివాడిని అన్నీతానై అపురూపంగా చూసుకుంది స్వాతి. బిడ్డను బాగుచేయించుకునేందుకు స్వాతికి అండగా నిలిచింది ఆమె కుటుంబం. మూడేళ్ళపాటు పసిబిడ్డను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుందా తల్లి.

చిన్నారి పుట్టుకకు కారణమైన తండ్రి మాత్రం ఆ బిడ్డని చూసేందుకు సైతం మనసొప్పలేదు. రాను రాను తనలోని అసలు రంగు బయటపెట్టుకున్నాడు. బిడ్డపుట్టంగానే రెక్కలు కట్టుకుని వాలిపోవాల్సిన తండ్రి మొహం చాటేశాడు. మానసిక వికలాంగుడైన ఆ బిడ్డ తనకి అక్కర్లేదన్నాడు. చంపి పడేయమంటూ నరహంతకుడి అవతారమెత్తాడు. అంతగా అయితే ఏ చెత్తకుప్పలోనో విసిరేయమంటూ స్వాతిని వేధించాడు. అదీ కాదంటే అనాథాశ్రమంలో వదిలేద్దామంటూ కొత్తవేషాలు మొదలెట్టాడు. అంతేగానీ తన ఇంట్లోకి అడుగుపెట్టనీయనంటూ కిరాతకత్వాన్ని బయటపెట్టుకున్నాడు

ఇవి కూడా చదవండి

కానీ స్వాతి ససేమిరా అంది. చావో రేవో నా బిడ్డతోనే అని తేల్చి చెప్పింది. ఒకటి కాదు రెండు కాదు పేగుతెంచుకుపుట్టిన పసిగుడ్డుని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంది. ఒకటి రెండు రోజులు కాదు మూడేళ్ళపాటు కన్నవారి ఇంట్లోనే ఉండి బాబుకి చికిత్స చేయించింది. ఎలాగైనా తన పాపాయికి ప్రాణం పోసిన తానే జీవితాన్నివ్వాలనుకుంది చల్లని తల్లి స్వాతి. తన బిడ్డ తన కాళ్ళపై తను నిలబడితే చాలనుకుంది. అప్పటి వరకు గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలనుకుంది. కానీ స్వాతి ఆశలను అడియాశలు చేశాడు దుర్మార్గుడైన తండ్రి. ఈ మూడేళ్ళల్లో కన్నబిడ్డవైపు కన్నెత్తి కూడా చూడలేదు ఆ దుర్మార్గుడు. నమ్మించి నట్టేట ముంచేశాడు. బాగా చూసుకుంటానని చెప్పి హైదరాబాద్‌కి తెచ్చి, కుటుంబసమేతంగా వేధింపులకు గురిచేశాడు.

అత్తమామలు.. ఆడబిడ్డ, ఆమె భర్త సహా స్వాతిని చిత్రహింసలు పెట్టారు. తల్లి ప్రాణాలనే హరించేశాడు. పండంటి బిడ్డ జీవితాన్నీ ఛిద్రం చేశాడు. చివరకు తండ్రి స్థానానికే మచ్చతెచ్చిన కర్కోటకుడిపై స్వాతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..