Hyderabad: బాదుడే బాదుడు 3గంటల్లో.. 6వేల చలాన్లు.. రూల్స్‌ పాటించకపోతే చుక్కలే

ట్రాఫిక్ రూల్స్‌ పాటించని వాహనదారులపై హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మొపుతున్నారు. ఇందులో భాగంగానే నగరంలో అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. రూల్స్‌ పాటించని వారిని పట్టుకొని చలాణాలు విధిస్తున్నారు. ఇలా ఒక్క రోజులోనే హైదరాబాద్‌ పోలీసులు 20వేలకు పైగా చలాణాలు విధించారు.

Hyderabad: బాదుడే బాదుడు 3గంటల్లో.. 6వేల చలాన్లు.. రూల్స్‌ పాటించకపోతే చుక్కలే
Hyderabad Traffic Chalance

Updated on: Oct 20, 2025 | 3:57 PM

ట్రాఫిక్ రూల్స్‌ పాటించని వాహనదారులపై హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మొపుతున్నారు. ఇందులో భాగంగానే నగరంలో అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ నెల 16న మొజంజాహి మార్కెట్‌ కూడలిలో ట్రాఫిక్ పోలీసులు స్పెషట్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ ప్రాంతం నిత్యం లక్షలాది మంది వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన మార్గం కావడంతో ఇక్కడ కేవలం 3 గంటల్లోనే 6వేలకు పైగా కేసులు నమోదు చేశారు పోలీసులు.

నమోదైన కేసులో చాలా వరకు సెల్‌ఫోన్‌ డ్రైవింగ్, మొబైల్‌ చూస్తూ వాహనాలు నడిపే వారే ఎక్కువగా ఉన్నారు.ఇలాంటి రూల్స్‌ పాటించని వారు ఒక్క రోజులో సుమారు 15వేల మంది వరకు పట్టుబడ్డారు. అయితే మూడు గంటల స్పెషల్‌ డ్రైవ్‌తోనే సుమారు 6వేల కేసులు నమోదైతే 24 గంటల వాహనాలపై శ్రద్ధపెడితే సుమారు 20వేల వరకు కేసు నమోదయ్యే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

అయితే నగరవ్యాప్తంగా పట్టుబడుతున్న వాహనదారుల్లో ద్విచక్రవాహనదారులే ఎక్కువగా ఉంటున్నారని పోలీసులు తెలుపుతున్నారు. వీరిలో హెల్మెట్‌ లేకుండా బైక్‌ డ్రైవ్ చేయడం, రాంగ్‌రూట్‌లో బైక్‌ నడపడం వంటి అతిక్రమణలపైనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్టు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.