Hyderabad Traffic Challan: బండి నడిపేటప్పుడు కేవలం హెల్మెట్, మాస్క్ లేకపోవడం వల్ల హైదరాబాద్‌లోని ఒక వ్యక్తి టు వీలర్ కి 141 చలాన్ల ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. బ్లాక్ అవెంజర్ AP13AB1474 వెయికిల్ కి మొత్తం 141 చలాన్ల పడగా.. ఫైన్ మొత్తం రూ. 33,000 పడింది. హైదరాబాద్ కలెక్టరేట్, జగదీష్ మార్కెట్ వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఫిరోజ్ అలీ జీవాని అనే ఒక వ్యక్తి వెహికిల్‌ను అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. అతని బైక్ నెంబర్‌ను చెక్ చేయగా.. 141 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు అబిడ్స్ పోలీసులు. వీటి విలువ రూ. 33,000. పెండింగ్ చలాన్ల కారణంగా ఆ వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు. అయితే, ఇవన్నీ గత ఐదేళ్ల వ్యవధిలో పడినట్లు తెలుస్తోంది. హెల్మెట్ ధరించకపోవడం, మాస్కులు లేకపోవడం వంటి వాటి వల్ల ఈ చలాన్లు విధించారు.
రెండ్రోజుల క్రితం కూడా ఓ వాహనానికి వందకు పైగా పెండింగ్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ ఫరీద్ ఖాన్ పేరుతో ఉన్న ఏపీ09 ఏయూ 1727 నెంబర్ గల హోండా యాక్టివాపై ఉన్న చలాన్లు చూసి ట్రాఫిక్ పోలీసులే షాకయ్యారు. 2015 నుంచి ఉల్లంఘనలకు పాల్పడుతూ వస్తోన్న ఆ వాహనంపై ఏకంగా 117 చనాన్లు నమోదయ్యాయి. వాటి విలువ రూ.30వేలు. అయితే, ఆ మొత్తాన్ని కట్టలేనని వాహనదారుడు చెప్పడంతో పోలీసులు యాక్టీవాను సీజ్ చేశారు.
Also read:
Shalu Chourasiya: కీలక మలుపులు తిరిగిన హీరోయిన్ శాలు చౌరాసియా కేసు.. నిందితుడిన పట్టుకున్న పోలీసులు
Suriya: ఆచార్యకు పోటీగా సూర్య సినిమా… థియేటర్లలో ఒకేరోజు సందడి చేయనున్న స్టార్ హీరోస్…