
కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రాజెక్టులకు రికార్డు స్థాయిలో నిధుల కేటాయింపు జరిగినట్లుగా ప్రకటించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. రాష్ట్రాల వారీగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు, హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు, ఆయా రాష్ట్రాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులను అశ్విని వైష్ణవ్ తెలిపారు. బడ్జెట్‌లో ప్రకటించిన ఏడు హైస్పీడ్ ట్రైన్ కారిడార్లలో మూడు హైస్పీడ్ ట్రైన్స్‌తో త్వరలోనే హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ మేజర్ హబ్‌గా హైదరాబాద్ మారబోతోంది. ఇది తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడనుంది. రవాణా సహా అనేక కీలక అంశాల్లో తెలంగాణకి లబ్ధి చేకూరనుంది. హెల్త్ కేర్, ట్రాన్స్ పోర్ట్, ఎడ్యుకేషన్ రంగాలకు బుల్లెట్ ట్రెయిన్స్ ఊతం ఇవ్వనున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరును కలిపే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు దక్షిణాది రాష్ట్రాలకు డైమెండ్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. వీలైనంత త్వరగా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించడం అలైన్మెంట్స్ ఖరారు చేయనున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. తెలంగాణ నుంచి హైదరాబాద్– చెన్నై, హైదరాబాద్–పూణే, హైదరాబాద్ – బెంగళూరుకు మూడు కొత్త హైస్పీడ్ ట్రైన్లు రానున్నాయి. గంటకు 350 కి.మీ వేగంతో ఈ ట్రైన్లు ప్రయాణిస్తూ ఆయా ప్రాంతాలతో కనెక్టివిటీ కలిగి ఉండనున్నాయి. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్), అలైన్ మెంట్స్ ఫైనలైజ్ కాగానే.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించనున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు.
మూడు గంటల్లో హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు..
బుల్లెట్ ట్రైన్స్ ఆపరేషన్‌లలోకి వస్తే.. హైదరాబాద్ నుంచి కీలక మెట్రోపాలిటన్ నగరాలైన ముంబై, బెంగళూరు, చెన్నై, పూణేలకు కేవలం మూడు గంటల్లోపే చేరుకోవచ్చు. ప్రధానంగా హైదరాబాద్–పూణేకు కేవలం 1:55 గంటల్లో, పూణే–ముంబయి 48 నిమిషాల్లో చేరుకోవచ్చు. అంటే హైదరాబాద్–ముంబాయికి కేవలం 2:30 నిమిషాల్లో ఈ హైస్పీడ్ ట్రైన్స్‌తో రీచ్ అవ్వొచ్చు. హైదరాబాద్–చెన్నైకు మూడు గంటల లోపు, హైదరాబాద్–బెంగళూరు రెండు గంటల్లో చేరుకోవచ్చు. బుల్లెట్ ట్రైన్‌తో మూడు మెట్రోపాలిటన్ సిటీల మధ్య కనెక్టివిటీలో గేమ్ చేంజర్‌గా హైదరాబాద్ మారనుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అశ్విని వైష్ణవ్. మొదటి దశలో ముంబాయి–అహ్మదాబాద్‌కు హైస్పీడ్ ట్రైన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా టెక్నికల్, డిజైన్, ఎలక్ట్రికల్ టీం అన్ని అంశాలను ఇప్పటికే పరిశీలించింది. ఇది సక్సెస్ కావడంతో సెకండ్ ఫేజ్‌లో దేశంలోని ఏడు ముఖ్య నగరాలను కలిపేలా కేంద్రం ఏడు బుల్లెట్ ట్రైన్లు తీసుకువచ్చింది. ఇందులో నార్త్‌కు రెండు, సౌత్–వెస్ట్ రాష్ట్రాలకు మిగిలిన ఐదు ట్రైన్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తి అయిన తర్వాత.. దేశవ్యాప్తంగా మరిన్ని హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్లు తీసుకురానుంది కేంద్రం. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు అన్నీ ఎలివేటెడ్ కారిడార్లుగా ఉండనున్నాయి. రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కేంద్రమంత్రి కోరారు. డిజైన్ డిపిఆర్‌లు సిద్ధమైన తరువాత బుల్లెట్ రైలు పనులు ప్రారంభం కానున్నాయి.
ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ లోని రైల్వే ప్రాజెక్ట్ ల అభివృద్ధికి కేంద్రం రూ. 5,454 కోట్లు కేటాయించింది. గత యూపీఏ హయాంలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన (రూ.886 కోట్లు ) బడ్జెట్ తో పోల్చితే 6 రెట్లు అధికంగా బడ్జెట్ కేటాయించారు.. ప్రస్తుతం తెలంగాణ లో రూ. 47,984 కోట్ల విలువైన ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి… అమృత్ స్టేషన్ స్కీం కింద రూ. 2015 కోట్లతో రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరించారు . 5 వందే భారత్, మూడు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ లతో ఇతర ప్రాంతాలకు తెలంగాణ నుంచి కనెక్టివిటీని మెరుగుపరాస్తున్నాయి.. అలాగే రాష్ట్రంలో 1,115 కి.మీ రైల్వే లైన్ 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తయింది.. 499 అండర్ పాస్, ఫ్లై ఓవర్లు నిర్మాణం జరిగింది.. అలాగే రైల్వే ప్రమాదాలను నివారించే దిశలో కవచ్ వ్యవస్థను ను 627 చోట్ల ఏర్పాటు చేశారు
తెలంగాణకి మించి రికార్డు స్థాయిలో ఏపీకి రైల్వే లో 10,134 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి.. ఏపీలో 92,649 కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయి ..ఏపీలో 3418 కోట్లతో 73 స్టేషన్లు పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి ..ఇప్పటికే సుల్లూరుపేట, రాయన్‌పాడు, కాకినాడ టౌన్, మంగళగిరి, తుని రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.ప్రీమియం రైలు సేవల విస్తరణతో రాష్ట్రంలో ప్రయాణ సామర్థ్యం కొత్త శిఖరాలకు చేరుకుంది
ప్రస్తుతం 8 వందేభారత్ సర్వీసులు ,8 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి…2014 నుండి, దాదాపు 1,700 కి.మీ రైల్వే ట్రాక్‌లు నిర్మించారు.. ఇది శ్రీలంక మొత్తం రైలు నెట్‌వర్క్ కంటే ఎక్కువ. ఏపిలో రైల్వే ట్రాక్ 100 శాతం విద్యుదీకరణ పూర్తయింది..2014 నుండి 1,949 కి.మీ రైలు మార్గాలను విద్యుదీకరించారు.805 ఫ్లైఓవర్లు అండర్ పాస్‌లనిర్మాణం జరిగింది.వీటితో పాటు కోల్ కతా నుంచి చెన్నైకి 4 లైన్ల రైల్వే లైన్ పనులు కూడా జరుగున్నాయి.. ఏపీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నామని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు .రైల్వే జోన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడానికి మూడు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుందని తెలిపారు.దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆపరేషన్ ప్రక్రియ చాలా జటిలమైనదని, సిబ్బంది మొత్తం మార్చాల్సిన అవసరం ఉందన్నారు. కంట్రోల్స్, కమాండ్, టైం టేబుల్ కూడా మార్పు జరగాలని, ఇదంతా కూడా చాలా జటిలమైన ప్రక్రియ అన్నారు. కొత్త జోన్ ఏర్పాటుకు గతంలో మూడు నాలుగు ఏళ్ళు పట్టేదని, ఈసారి తాము చాలా ఫాస్ట్ ట్రాక్లో పనిచేస్తున్నామని చెప్పారు. సజావుగా ఈ మార్పిడి ప్రక్రియ జరిగేందుకు పనిచేస్తున్నామని, సౌత్ కొస్టల్ జోన్ రైల్వే కార్యాలయం నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. చాలా వేగంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది అని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..