
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పోరు హోరా హోరీగా సాగుతోంది. ముఖ్యంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకు, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఇద్దరూ బరిలో నిలిచారు. అయితే ఇప్పటి వరకూ జరిగిన కౌంటింగ్లో రెండు సార్లు మాధవీలత అసదుద్దీన్ పై ఆధిక్యలోకి రావడం విశేషం. 12 రౌండు ముగిసే సమయానికి మాధవీలత కంటే అసదుద్దీన్ అధిక్యంలో కొనసాగారు. చివరి వరకు ఫలితం ఉత్కంఠగా సాగింది. ఒకానొక సమయంలో 33వేల ఓట్ల మెజార్టీతో అసదుద్దీన్ కు ఓట్లకు కాస్త దగ్గరగా వచ్చారు మాధవీలత. కానీ చివరి రౌండులో అసదుద్దీన్ విజయం సాధించారు.
ఇక అసదుద్దీన్ రాజకీయ నేపథ్యం చూస్తే.. హైదరాబాద్ నియోజకవర్గంలో 1984 నుండి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. అసదుద్దీన్ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ వరుసగా 6 సార్లు ఈ స్థానంలో గెలుపొందారు. 1996లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు బీజేపీ తరఫున పోటీ చేసి సలావుద్దీన్ చేతిలో 73 వేల ఓట్లతో ఓడిపోయారు. తండ్రి ప్రస్థానం ముగిశాక 2004, 2009, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి వరుసగా నాలుగోసారి విజయం సాధించారు అసదుద్దీన్ ఓవైసీ. అయితే బీజేపీ నుంచి భగవంత రావు, బీఆర్ఎస్ నుంచి పుస్తే శ్రీకాంత్, కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2024లో ఇదే హైదరాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేశారు. అయితే ఎప్పుడూ లేనంత టఫ్ ఫైట్‌ను ఎదుర్కొన్నారు. బీజేపీ తరఫున విరించి హాస్పిటల్ మాజీ ఛైర్మన్ మాధవి లత పోటీ చేశారు. చివరి వరకు హోరా హోరీగా సాగిన పోరులో మాధవీలతపై 3,23,894 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. దీంతో వరుసగా ఐదు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించిన నాయకుడిగా రికార్డు సృష్టించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..